iDreamPost
android-app
ios-app

రీ రిలీజ్ ట్రెండ్ మురారి మూవీ సరికొత్త రికార్డ్! ఇది మహేశ్ బాబు రేంజ్!

  • Published Aug 10, 2024 | 11:52 AM Updated Updated Aug 10, 2024 | 11:52 AM

Murari Re Release Collections: ఇప్పుడు థియేటర్స్ లో రీరిలీజ్ ల సినిమాలు ట్రెండ్ ను సెట్ చేస్తున్నాయంటే.. తాజాగా మహేష్ మురారి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి కలెక్షన్స్ వరకు స్పెషల్ రికార్డు ను క్రియేట్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Murari Re Release Collections: ఇప్పుడు థియేటర్స్ లో రీరిలీజ్ ల సినిమాలు ట్రెండ్ ను సెట్ చేస్తున్నాయంటే.. తాజాగా మహేష్ మురారి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి కలెక్షన్స్ వరకు స్పెషల్ రికార్డు ను క్రియేట్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 10, 2024 | 11:52 AMUpdated Aug 10, 2024 | 11:52 AM
రీ రిలీజ్ ట్రెండ్ మురారి మూవీ సరికొత్త రికార్డ్! ఇది మహేశ్ బాబు రేంజ్!

ప్రస్తుతం స్టార్ హీరోల స్పెషల్ డేస్ లో.. వారి కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రివీల్ చేయడంతో పాటు.. వారి కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ ను రీరిలీజ్ చేయడంలో కూడా ట్రెండ్ గా మాదిరిపోయింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా ఆగష్టు9 న మహేష్ బాబు బర్త్ డే సంధర్బంగా ‘మురారి’ మూవీ రీరిలీజ్ అయిందన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏ రీరిలీజ్ కు లేని విధంగా.. సోషల్ మీడియాలో మురారి మూవీ ప్రమోషన్స్ సరికొత్తగా జరిగాయి. ఇలా ప్రమోషన్స్ చేయడమే కొత్త ట్రెండ్ ను సెట్ చేసిందంటే.. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి కలెక్షన్స్ వరకు స్పెషల్ రికార్డు ను క్రియేట్ చేసి.. ఇప్పటివరకు రీరిలీజ్ అయినా సినిమాలలో టాప్ లో నిలిచింది.

రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన.. మురారి మూవీకి ఫ్యాన్స్ చేసిన సెలెబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోస్ ఏ కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ లో రీరిలీజ్ ను కూడా సెలెబ్రేట్ చేయడం.. కేవలం తెలుగు సినిమాలకే సాధ్యం అని ప్రేక్షులు మరొక్కసారి మురారి మూవీతో నిరూపించారు. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్ లో మురారి మూవీ..ఏపీ , నైజం లో కలిపి రూ. 2.26 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు మహేష్ రీరిలీజ్ సినిమాలలో బిజినెస్ మ్యాన్ తర్వాత.. మురారి హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక వీకెండ్ కావడంతో.. శనివారం కూడా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో.. రూ. 20 ల‌క్ష‌ల‌కు పైగా వచ్చినట్లు సమాచారం. మహేష్ కెరీర్ లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ.. ఇప్పుడు రీరిలీజ్ తో మరొక్కసారి రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

Murari

ఇక మహేష్ విషయానికొస్తే.. మురారి మూవీతో అభిమానులు మహేష్ బర్త్ డే నే గ్రాండ్ గానే సెలెబ్రేట్ చేశారు. కానీ అభిమానులకు ఒకే ఒక్క నిరాశ ఏంటంటే.. ప్రస్తుతం మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడం. ఆల్రెడీ ఇప్పటికే ఈ సినిమా గురించి మీడియా సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ అవుతూనే ఉంది. కానీ మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్ డేట్స్ లేవు. త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇక రానున్న రోజుల్లో అయినా మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఇస్తారో లేదో వేచి చూడాలి. మరి ప్రస్తుతం మురారి మూవీ క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet