iDreamPost
android-app
ios-app

ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2.. డ్యాన్సర్ జానుకు ఇన్ని కష్టాలా?.. కన్నీళ్లు తెప్పిస్తున్న లైఫ్ స్టోరీ

  • Published Aug 14, 2024 | 9:15 AM Updated Updated Aug 14, 2024 | 9:15 AM

Dhee Celebrity Special 2: డ్యాన్స్ రియాలిటీ షో ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 లో ఫోక్ డ్యాన్సర్ జాను లైఫ్ స్టోరీపై చేసిన పర్ఫామెన్స్ అందరినీ కంటతడి పెట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Dhee Celebrity Special 2: డ్యాన్స్ రియాలిటీ షో ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 లో ఫోక్ డ్యాన్సర్ జాను లైఫ్ స్టోరీపై చేసిన పర్ఫామెన్స్ అందరినీ కంటతడి పెట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  • Published Aug 14, 2024 | 9:15 AMUpdated Aug 14, 2024 | 9:15 AM
ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2.. డ్యాన్సర్ జానుకు ఇన్ని కష్టాలా?.. కన్నీళ్లు తెప్పిస్తున్న లైఫ్ స్టోరీ

బుల్లి తెరపై అత్యంత ఆదరణ పొందిన షోలల్లో ఢీ ప్రోగ్రామ్ ఒకటి. టాలెంట్ ఉండి అవకాశం దొరకక నిరాశలో ఉన్న డ్యాన్సర్లకు గొప్ప వేదిక ఢీ షో. ఎంతో మంది డ్యాన్సర్లు ఈ షోద్వారా తమ ట్యాలెంట్ ను నిరూపించుకుని వారికంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఫోక్ డ్యాన్సర్ జాను లిరి ఢీ షోలో పాల్గొనే ఛాన్స్ పొందింది. ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2లో జాను పర్ఫామెన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో జాను లిరీ లైఫ్ స్టోరీపై చేసిన పర్ఫామెన్స్ అందరినీ కంట తడి పెట్టించింది. జానుకు ఇన్ని కష్టాలున్నాయా? గుండెల్లో ఇంత భారం మోస్తున్నదా? అని ఇది చూసిన వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

జాను.. ఈ పేరు తెలియని వారుండరేమో. ఫోక్ సాంగ్ ఏదైనా సరే జాను డ్యాన్స్ చేసిందంటే చాలు ఓ రేంజ్ లో హిట్ అయినట్టే. ఇప్పటి వరకు ఎన్నో సాంగ్స్ కు పర్ఫామెన్స్ చేసింది. ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొడుతూ వీక్షకులను కట్టిపడేసింది. జాను డ్యాన్స్ చేస్తుంటే నెమలి నాట్యామాడుతున్నట్లే ఉంటుంది. ఇంతటి ప్రతిభ ఉన్న జానుకు ఢీ షోలో అవకాశం లభించింది. ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 లో పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ షోలో జాను లైఫ్ స్టోరీపై చేసిన పర్ఫామెన్స్ కన్నీళ్లు తెప్పిస్తున్నది. జాను వ్యక్తిగత జీవితం, తను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎదురైన సవాళ్లు, వాటిని అదిగమించిన తీరును ఈ పర్పామెన్స్ ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించారు.

dancer janu emotional words

జాను తన కొడుకుతో కలిసి భర్తతో విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. సొసైటీ నుంచి తనకు ఎదురయ్యే సూటిపోటి మాటలు, కష్టాలను తెలిసేలా చూపించారు. ఈవెంట్స్ ముగిశాక పేమెంట్ కోసం అడిగితే జాను పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు.. ఆ డబ్బులతో తన కొడుకును సాదుకోలేనని చెప్పడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఇదేదో చేసిందంటూ అందుకే మొగుడు వదిలేసాడంటూ పోకిరీలు చేసే కామెంట్స్.. జాను వారిని ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్ చూశావా.. చూసినట్లే మాట్లాడుతున్నావ్.. నీ అక్కకో చెల్లికో జరిగితే ఇలాగే మాట్లాడుతావా అంటూ జాను బుద్ది చెప్తుంది. కష్టాలను భరించలేక చనిపోవాలనుకుంటుంది. కానీ తన కొడుకు కోసం ఎన్ని కష్టాలైనా భరించి తన కొడుకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. జాను లైఫ్ స్టోరీకి సంబంధించిన ఈ పర్ఫామెన్స్ కు స్టేజ్ పై ఉన్న వారితో పాటు.. ప్రేక్షకులు సైతం కంటతడి పెట్టుకున్నారు. మరి జానుకు ఎదురైన కష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişantikbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom