iDreamPost
android-app
ios-app

Mr. Bachchan Trailer: ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్.. రవితేజ ఫ్యాన్స్‌కి పూనకాలే ఈసారి..

  • Published Aug 07, 2024 | 7:29 PM Updated Updated Aug 07, 2024 | 7:29 PM

Mr. Bachchan Trailer Review in Telugu: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు చూద్దాం.

Mr. Bachchan Trailer Review in Telugu: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు చూద్దాం.

Mr. Bachchan Trailer: ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్.. రవితేజ ఫ్యాన్స్‌కి పూనకాలే ఈసారి..

మాస్ మహారాజా రవితేజకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. రవితేజ ఎనర్జీ, డైలాగ్ డెలివరీకి, ఆ మాడ్యులేషన్ కి ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. అలాంటి రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేసే డైరెక్టర్ హరీష్ శంకర్. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారంటీ హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం మిస్టర్ బచ్చన్. మిరపకాయ్ లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. గద్దలకొండ గణేష్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న హరీష్ శంకర్ దాదాపు ఐదేళ్ల భారీ గ్యాప్ తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా.. జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి.

టీజర్ లో చెప్పినట్టు ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు, నల్లధనం అనే డైలాగ్ తో ఈ సినిమా బ్లాక్ మనీ చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతుంది. ఇప్పటివరకూ రవితేజ బ్లాక్ మనీ అనే కాన్సెప్ట్ తో మూవీ చేయలేదు. ఈ మూవీతో దాన్ని ఫిల్ చేయనున్నారు. ‘సక్సెస్, ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాల్లాంటివి. వస్తుంటాయ్, పోతుంటాయ్. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది.. అది పోయేదాకా మనతోనే ఉంటుంది’ అనే డైలాగ్ ఆకట్టుకుంది. టీజర్ లోనే ఇంతలా ఉంటే ఇక ట్రైలర్ లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న మిస్టర్ బచ్చన్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ని లాంచ్ చేసింది. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన మాస్ మహారాజా రవితేజ తాజాగా ట్రైలర్ తో ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. 

mr bachan trailer review

‘సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు.. సంపద కాపాడేవాడు కూడా సైనికుడే’ అనే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఎక్కడో మారుమూల గ్రామంలో సరదాగా తిరిగే కుర్రాడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా పని చేయడం.. ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాల్సి రావడం వంటి ఎలిమెంట్స్ తో సినిమా ఎలా ఉంటుందో అనేది ట్రైలర్ లో చెప్పారు. వింటేజ్ లుక్స్ తో రవితేజ అదరగొట్టారు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ తనదైన లుక్స్ తో ఆకట్టుకున్నారు. మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ‘ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ ఫుల్ అని నిరూపిస్తా’ అనే డైలాగ్ సూపర్ ఉంది.  ‘ఆగస్టు 15న ఏం జరిగిందో తెలుసా మీకు.. ఆరోజు 70 ఎంఎం స్టీరియో ఫోనిక్ షోలే రిలీజ్ అయ్యింది’ అనే డైలాగ్ కి తగ్గట్టే ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి అమితాబ్ బచ్చన్ అభిమానిగా, ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా రవితేజ మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించనున్నారు. కామెడీ, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో కిక్ ఇచ్చే కాన్సెప్ట్ తో రవితేజ అదరగొట్టబోతున్నారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş