iDreamPost
android-app
ios-app

‘మిస్టర్ బచ్చన్’ డిఫరెంట్ పబ్లిసిటీ.. మెట్రోలో మాస్ మహారాజా రచ్చ!

  • Published Aug 02, 2024 | 3:52 PM Updated Updated Aug 02, 2024 | 3:52 PM

Mr. Bachchan Metro Promotions: రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'మిస్టర్ బచ్చన్' మూవీ తెరెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది మూవీ టీమ్. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊహించని సర్ఫ్రైజ్ ఇచ్చింది.

Mr. Bachchan Metro Promotions: రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'మిస్టర్ బచ్చన్' మూవీ తెరెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది మూవీ టీమ్. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊహించని సర్ఫ్రైజ్ ఇచ్చింది.

‘మిస్టర్ బచ్చన్’ డిఫరెంట్ పబ్లిసిటీ.. మెట్రోలో మాస్ మహారాజా రచ్చ!

సినిమాను తెరకెక్కించడం ఓ కళ అయితే.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి బజ్ ను క్రియేట్ చేయడం ఇంకో కళ. ఇది అందరికి ఉండదు. విభిన్నమైన ప్రమోషన్లు చేసి, ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే సినిమాపై ప్రేక్షకులకు ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. దాంతో థియేటర్లకు క్యూ కడతారు. అందుకే సినిమాకు ప్రమోషన్లు కీలకం అనేది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు? అనే కదా మీ డౌట్. దానికి ఓ రీజన్ ఉంది. రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ తెరెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ప్రమోషన్ కార్యక్రమాలను జెట్ స్పీడ్ లో చేస్తున్నారు మేకర్స్.

మాస్ మహారాజా రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఆగస్ట్ 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. అయితే సాధారణ పబ్లిసిటీకి భిన్నంగా, కాస్త డిఫరెంట్ గా హరీష్ శంకర్ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతోంది. రవితేజ వాయిస్ తో మెట్రోలో చేసిన పబ్లిసిటీకి జనాలు ఫిదా అవుతున్నారు. మిస్టర్ బచ్చన్ పబ్లిసిటీ కోసం మేకర్స్ హైదరాబాద్ మెట్రోను ఎంచుకున్నారు. రవితేజ తన వాయిస్ తో మెట్రో ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేశాడు.

“మెట్రో ప్రయాణికులకు స్వాగతం.. సుస్వాగతం. ఏం తమ్ముళ్లు సీటు దొరకలేదా? లేక కూర్చోగానే లేపుతున్నారా? మరేం పర్లేదు. మిస్టర్ బచ్చన్ నుంచి ఓ పాట రిలీజ్ అయ్యింది. ఆ పాట హ్యాపీగా వింటూ మీరు దిగే స్టేషన్ వరకు వెళ్లిపోండి. ఇక్కడ సీటు దొరక్కపోయినా పర్వాలేదు..  ఆగస్ట్ 15న థియేటర్లకు వచ్చేయండి. అక్కడ సీటు గ్యారంటీ” అంటూ తన వాయిస్ తో రవితేజ ప్రయాణికులకు సర్ఫ్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ గా మారింది. దాంతో ఇదెక్కడి మాస్ పబ్లిసిటీ మావ అంటూ అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ డిఫరెంట్ పబ్లిసిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.