iDreamPost
android-app
ios-app

ఆరోజున మల్టీప్లెక్సుల్లో 99 రూపాయలకే టికెట్స్.. మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్

  • Published May 28, 2024 | 9:10 PM Updated Updated May 28, 2024 | 9:10 PM

Movie Ticket@Rs.99: గం గం గణేశా, భజే వాయు వేగం సినిమాలని 99 రూపాయలకే చూస్తారా? అయితే మీ కోసం ఈ బంపర్ ఆఫర్. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినిమా లవర్స్ కోసం అన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 99 రూపాయలకే సినిమా చూసే అవకాశం కల్పించింది.

Movie Ticket@Rs.99: గం గం గణేశా, భజే వాయు వేగం సినిమాలని 99 రూపాయలకే చూస్తారా? అయితే మీ కోసం ఈ బంపర్ ఆఫర్. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినిమా లవర్స్ కోసం అన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 99 రూపాయలకే సినిమా చూసే అవకాశం కల్పించింది.

  • Published May 28, 2024 | 9:10 PMUpdated May 28, 2024 | 9:10 PM
ఆరోజున మల్టీప్లెక్సుల్లో 99 రూపాయలకే టికెట్స్.. మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్

మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సినిమా చూడాలంటే టికెట్ ధర కనీసం 250 రూపాయలు పెట్టాలి. అయితే సినిమా లవర్స్ కి ఆ ఒక్కరోజు కేవలం 99 రూపాయలకే సినిమా చూసే అవకాశం కల్పిస్తుంది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సినిమా టికెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించడం అనేది జరుగుతున్నదే. తాజాగా మరోసారి టికెట్స్ పై భారీ డిస్కౌంట్స్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే 31న సినిమా లవర్స్ డే సందర్భంగా మూవీ లవర్స్ కోసం 99 రూపాయలకే సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఏ సినిమా అయినా,  ఏ షో అయినా కేవలం 99 రూపాయలకే చూడవచ్చునని ఒక ప్రకటనలో పేర్కొంది. రిక్లైనర్స్, ప్రీమియం ఫార్మాట్స్ మినహాయించి మిగతా సీట్లకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది.

99 రూపాయలకే సినిమా:

దేశవ్యాప్తంగా ఉన్న 4 వేల కంటే ఎక్కువ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో 99 రూపాయలకే సినిమా చూసే అవకాశం కల్పించారు. పీవీఆర్-ఐనాక్స్, సినీ పోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్త ఏ2, మూవీ టైం, మూవీ మ్యాక్స్, వేవ్, ఎం2కే, డిలైట్ సహా అనేక మల్టీప్లెక్సుల్లో సినిమాలు చూడవచ్చునని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. గత ఏడాది, ఈ ఏడాది అన్ని వయసుల వారు కలిసి బాక్సాఫీస్ వద్ద అనేక సినిమాలను హిట్ చేశారు. అందుకు కృతజ్ఞతగా సినిమా లవర్స్ డే నాడు ప్రత్యేకంగా ఈ ఆఫర్ ని తీసుకొస్తున్నామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాబట్టి ఏవైనా సినిమాలు మిస్ అయి ఉంటే ఒక్కో సినిమాని 99 రూపాయలకే చూసేయచ్చు.

గంగం గణేశా, భజే వాయు వేగం:

లవ్ మీ ఇఫ్ యూ డేర్, రాజు యాదవ్ సహా అనేక సినిమాలు ఉన్నాయి. అలానే ఈ శుక్రవారం పలు సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. జాన్వీకపూర్, రాజ్ కుమార్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా కూడా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. అలానే ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా మూవీ, కార్తికేయ గుమ్మకొండ నటించిన భజే వాయు వేగం సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి మే 31 శుక్రవారం నాడు కొత్త సినిమాలను మీరు 99 రూపాయలకే చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా లవర్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio