Vamsi Krishna Reddy: మేము ఇద్దరం విడిపోవడానికి కారణం? మొదటిసారి చెప్పిన నిజాలు!

సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణారెడ్డి తన భార్య నేత్రా రెడ్డి నుంచి విడిపోయాడు. ఈ క్రమంలో తాజాగా విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణారెడ్డి తన భార్య నేత్రా రెడ్డి నుంచి విడిపోయాడు. ఈ క్రమంలో తాజాగా విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

సోషల్‌ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. చాలా మంది రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారుతున్నారు. దీనివల్ల కొత్త టాలెంట్‌ బయటకు వచ్చింది. నయా ఆలోచనలు, వ్యాపారాలకు సోషల్‌ మీడియా ఎంతో మంచి ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. అలా ఈమధ్య కాలంలో అలా ట్రెండింగ్‌లో నిలిచిన జంట మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణ-నేత్రా రెడ్డి. సామాన్యులకు వీరు తెలుసో లేదో కానీ.. సోషల్‌ మీడియను ఫాలో అయ్యేవారికి మాత్రం వీరి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వంశీకృష్ణరెడ్డి మోటివేషనల్‌ స్పీకర్‌గా జనాలకు పరిచయం అయితే.. ఉన్నత చదువులు చదివి.. సేంద్రీయ వ్యవసాయం వైపు వచ్చి.. విజయం సాధించిన మహిళగా నేత్రా రెడ్డి గుర్తింపు పొందింది.

సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలైన ఈ జంట.. రెండు సంవత్సరాల క్రితం ప్రేమించి.. పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి సేంద్రీయ వ్యవసాయం, ఉత్పత్తుల గురించి వీడియోలు చేస్తూ.. సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుండేవారు. ఎంతోమంది యువతీయువకులకు ఈ జంట ఆదర్శంగా నిలిచింది అని చెప్పవచ్చు. సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలోకి ఏ సమస్యలు వచ్చాయో తెలియదు కానీ.. వీరిద్దరూ విడిపోయారు. తాము విడాకులు తీసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు వంశీకృష్ణ, నేత్రా రెడ్డిలు. అందుకు గల కారణాలు మాత్రం చెప్పలేదు.

ఈక్రమంలో తాజాగా ఐడ్రీమ్‌ మీడియా వంశీకృష్ణను ఇంటర్వ్యూ చేసింది. విడిపోవడానికి గల కారణాలపై ప్రశ్నించింది. ఈ సందర్భంగా వంశీకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి తమ విడాకులు అంశంపై స్పందించాడు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘విడాకుల గురించి ఒపెన్‌గా మాట్లాడకూడదని మేం ముందుగానే అనుకున్నాం. అందుకే విడాకులకు గల కారణాల గురించి నేను ఏం చెప్పలేను. కానీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని విభేదాలు వచ్చాయి. నవంబర్‌ వరకు కలిసి ఉన్నాం.. కానీ ఇంతలోనే ఈ ప్రకటన అంటే.. కలిసి ఉన్నప్పుడు మేం సంతోషంగా లేము. ఊపిరాడన్నట్లు అనిపించింది. ఎంత అడ్జస్ట్‌ అయినా పరిస్థితులు మారలేదు. ఏదో అసంతృప్తి. అందుకే విడిపోయాము’’ అని తెలిపాడు.

‘‘కలిసి ఉన్న రోజుల్లో మేం ఎంతో సంతోషంగా ఉన్నాము. అసలు విడిపోతామనే ఆలోచన కూడా రాలేదు. ఏడాదిన్నరకు పైగానే.. కేవలం మేమిద్దరం మాత్రమే కలిసి ఉన్నాం. మేం ఒకరికి ఒకరం ఎక్కువ అలవాటు. మాతోపాటు ఎవరూ లేరు కదా.. ఒకరితో ఒకరం ఉండటం వల్ల మామధ్య ఎక్కువ అటాచ్‌మెంట్‌ ఉంటుండే. మేం బయటకు కూడా ఎక్కువగా వెళ్లకపోయేవాళ్లం. మేం ఇద్దరం కలిసి ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేసే వాళ్లం. మా మధ్య పెద్దగా గొడవలు కూడా జరిగేవి కావు. మరి దిష్టి తగిలిందేమో. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి పూర్తిగా చేయి జారిపోయిన తర్వాతే మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పుకొచ్చాడు వంశీకృష్ణ

Show comments