iDreamPost
android-app
ios-app

ముగిసిన 29 ఏళ్ళ అనుబంధం.. AR Rahman దంపతులు విడాకులు!

  • Published Nov 20, 2024 | 12:08 PM Updated Updated Nov 20, 2024 | 12:08 PM

AR Rahman: తన మ్యూజిక్ తో కోట్ల మంది ఆడియన్స్ ని మ్యాజిక్ చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

AR Rahman: తన మ్యూజిక్ తో కోట్ల మంది ఆడియన్స్ ని మ్యాజిక్ చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  • Published Nov 20, 2024 | 12:08 PMUpdated Nov 20, 2024 | 12:08 PM
ముగిసిన 29 ఏళ్ళ అనుబంధం.. AR Rahman దంపతులు విడాకులు!

సినీ ఇండస్ట్రీలో ఏఆర్ రెహ్మాన్ అనే పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఏఆర్ రహమాన్ సంగీత ప్రపంచంలో ఒక ట్రెండ్ సృష్టించారు. తన మ్యూజిక్ తో కోట్ల మంది ఆడియన్స్ ని మ్యాజిక్ చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన భార్య సైరా భాను‌తో 29 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. సుమారు మూడు దశాబ్దల పాటు కలిసి ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోవడంపై సినీ ఇండస్ట్రీలో ప్రధాన చర్చనీయంశంగా మారింది. వీరిద్దరూ పరస్పర అవగాహన, అంగీకారంతోనే విడిపోతున్నారు.

సైరాబాను, రెహమాన్ విడాకుల విషయాన్ని సైరా బాను తరుపు లాయర్ వందనా షా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా, 1995 మార్చి లో ఈ జంటకు వివాహం జరిగింది. మరికొద్ది రోజుల్లో 30వ వివాహ వార్షికోత్సవం జరపుకోనున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ కి ఎంత గొప్ప పేరు ఉందో అందరికీ తెలిసిందే. స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీతో వరల్డ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ అందుకున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో లైవ్ షోలు ఇస్తూ ప్రేక్షకులకు ఎప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. సైరా బాను, రెహమాన్ విడాకుల విషయం గురించి ఆమె లాయర్ వందనా షా మాట్లాడుతూ.. ‘వివాహం చేసుకున్న దాదాపు 29 ఏళ్ల తర్వాత సైరా, రహమాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ జంట ఒకరి పట్ల ఒకరు అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ.. కొన్ని వ్యక్తిగత కారణాలు, ఇబ్బందుల నేపథ్యంలో వారి మధ్య దూరం బాగా పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే ఇరువురి అంగీకారం మేరకు విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన పరిస్థితిని అర్థం చేసుకోవాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరా, రెహమాన్ కోరుతున్నారు’ అని పేర్కొన్నారు. ఏఆర్ రెహమాన్, సైరా భానులది పెద్దలు కుదిర్చిన పెళ్లి. 1995, మార్చి 12న వీరిద్దరు నిఖా చేసుకున్నారు. ఈ జంటకు ఖతీజా, రహిమా అనే ఇద్దరు కూతుళ్ళతో పాటు అమీన్ అనే కొడుకు ఉన్నారు. తమ తల్లిదండ్రుల విడాకుల నేపథ్యంలో తమ వ్యక్తితగ గోప్యతను గౌరవించాలని రెహమాన్ తనయుడు అమీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.ఇదిలా ఉంటే.. తమ విడాకులపై రెహమాన్ స్పందిస్తూ.. మేం గ్రాండ్ 30వ వివాహ వార్షికోత్సవం చేసుకోవాలని ఆశించాం. కానీ, అనూహ్య రీతిలో మా దాంపత్యానికి ముగింపు పలకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంతో సున్నితమైన పరిస్థితి.. దయచేసి అందరూ అర్ధం చేసుకుంటారని భావిస్తున్నా.ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap