iDreamPost
android-app
ios-app

విడాకుల ప్రకటనపై జయం రవి భార్య షాకింగ్ కామెంట్స్

  • Published Sep 11, 2024 | 12:19 PM Updated Updated Sep 11, 2024 | 12:19 PM

Jayam Ravi: ఇటీవలే భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా జయం రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Jayam Ravi: ఇటీవలే భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా జయం రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Sep 11, 2024 | 12:19 PMUpdated Sep 11, 2024 | 12:19 PM
విడాకుల ప్రకటనపై జయం రవి భార్య షాకింగ్ కామెంట్స్

తమిళ స్టార్ నటుడు జయం రవి,ఆయన సతిమణి ఆర్తి రవితో తమ వైవాహిక బంధానికి ఇటీవలే స్వస్థి పలికిన విషయం తెలిసిందే. ఈ మేరకు జయం రవి తన ఎక్స్ ఖాతా వేదికగా.. తామిద్దరం విడిపోతున్నట్లు అధికారికంగా నోట్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ దంపతులు మధ్య గత కొంత కాలంగా విబేధాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో వీరిద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలో తామిద్దరు కలిసివుండే కొన్ని ఫోటోలను తీసేయడంతో.. అప్పటి నుంచి వీరి విడాకుల రూమర్స్ కు ఊపందుకుంది. కానీ, తాజాగా ఇప్పుడు ఆ రూమర్సే నిజమయ్యేలా జయం రవి తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఆఫీషియల్ గా ప్రకటించారు. అయితే తాజాగా ఈ ప్రకటనపై ఆయన భార్య ఆర్తి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలేంటో చూద్దాం.

ఇటీవలే భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా జయం రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె కూడా సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేశారు. అయితే ఆ నోట్ లో ఆర్తి ఈ విధంగా రాసుకొచ్చింది. ‘నాకు తెలియకుండానే ఈ అధికారిక విడాకుల ప్రకటన చూసి నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. దాదాపు 18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అలాంటిది ఇంత ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను చాలా బాధించింది. కొంతకాలంగా మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. అయితే ఇప్పటికీ నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ, దురదృష్టవశాత్తూ నాకు ఆ అవకాశం దక్కలేదు. అయిన ఈ ప్రకటనతో నేను, నా పిల్లలు చాలా షాకయ్యాం.

Jayam Ravi wife

ఇది కేవలం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు ఏమాత్రం మంచి జరగదు. అయితే ఈ విషయం పై బాధగా ఉన్నప్పటికీ నేను గౌరవంగా ఉండాని అనుకుంటున్నాను. అందుకే పబ్లిక్ గా కామెంట్ చేయడం లేదు. కానీ, అన్యాయంగా నాపై నిందలు వేసి నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం నాకు కష్టంగా ఉంది. అయితే ఒక తల్లిగా.. నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల శ్రేయస్సే.. అయితే ఇప్పుడు ఈ వార్త నా పిల్లలపై ప్రభఆవం చూపుతుందనే బాధ నాకు ఎక్కువగా ఉంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను నమ్ముతున్నాను. ఇక ఇన్ని రోజులు మాకు మద్దతు ఇచ్చిన ప్రెస్, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమే మాకు అతిపెద్ద బలం, మా గోప్యతకు ఎలాంటి భంగం కలింగించొద్దని కోరుకుంటున్నా’ అంటూ ఆర్తి రాసుకొచ్చారు.

మరీ, ప్రస్తుతం ఆర్తి రిలీజ్ చేసిన నోట్ నెట్టింట వైరల్ గా మారింది. అయతే ఈ నోట్ ను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ అసలు ఈ దంపతులు మధ్య ఏం జరుగుతుంది,నిజంగానే ఆర్తికి తెలియకుండానే జయం రవి ఈ పోస్ట్ ను రిలీజ్ చేశారా.. మళ్లీ ఈ దంపతులు కలిసిపోతే చాలా బాగున్నంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరీ, ఆర్తి రవి తన భర్త విడుదల చేసిన విడాకుల నోట్ ను ఉద్దేశించి చేసిన షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş