iDreamPost
android-app
ios-app

పవర్ ఫుల్ పోలీస్ గా మొగలి రేకులు హీరో కొత్త చిత్రం

  • Published Feb 03, 2024 | 2:01 PM Updated Updated Feb 03, 2024 | 2:01 PM

ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఎంతో మంది.. వెండితెరపై అడుగుపెడుతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే మొగలిరేకులు సీరియల్ యాక్టర్ 'సాగర్' .. మరో కొత్త చిత్రంలో నటించాడు.

ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఎంతో మంది.. వెండితెరపై అడుగుపెడుతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే మొగలిరేకులు సీరియల్ యాక్టర్ 'సాగర్' .. మరో కొత్త చిత్రంలో నటించాడు.

  • Published Feb 03, 2024 | 2:01 PMUpdated Feb 03, 2024 | 2:01 PM
పవర్ ఫుల్ పోలీస్ గా మొగలి రేకులు హీరో కొత్త చిత్రం

తెలుగు టెలివిజన్ పరిశ్రమలో.. సీరియల్స్ కు నిత్యం మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో టెలివిజన్ సీరియల్ చరిత్రలో ఏ సీరియల్ కు రాని పేరు “మొగలి రేకులు” సీరియల్ కు వచ్చింది. ఇప్పటికి ఆ సీరియల్ లోని నటి నటులంటే అందరికి అభిమానమే. అంతలా సీరియల్ ప్రియుల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు.. ఆ నటీ నటులు. ఆ సీరియల్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన వ్యక్తి ‘సాగర్’. కానీ సాగర్ అనే పేరుకంటే ఆర్ కే నాయుడు అంటే.. అందరూ సులువుగా గుర్తుపట్టేస్తారు. అతని కొడుకు ‘మున్నా’ పాత్రలో కూడా నటించింది కూడ ఇతనే. అయితే కొంతకాలం కిందట ఇతను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు ఈ సీరియల్ హీరో. ఆ సినిమా వివరాలు తెలుసుకుందాం.

సాగర్ ముందుగా ‘సిద్దార్థ’ అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘షాదీ ముబారక్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆ తర్వాత ఈ హీరో నుంచి ఎటువంటి అప్ డేట్స్ లేవు. కానీ, ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో హీరోగా నటించాడట ‘సాగర్’ . ఆ సినిమా పేరు “ది 100”. కొత్త రకంగా టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా పోస్టర్.. ఇప్పుడు సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. గతంలో ఈ దర్శకుడు చేసిన కొన్ని ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కు మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాలి. కాగా, ఈ మూవీలో విక్రాంత్ అనే పోలీస్ అధికారి పాత్రలో నటించారు ‘సాగర్’ . సీరియల్ లోనే ఆర్ కే నాయుడిగా పోలీస్ పాత్రలో ఒదిగిపోయిన సాగర్.. ఇక సినిమాలో ఏ రేంజ్ లో కనిపిస్తాడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరో వైపు పోస్టర్ ను గమనిస్తే.. ఈ మూవీ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో, మంచి యాక్షన్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం సాగర్.. ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టుగా సమాచారం.

కాగా, ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించడం విశేషం. ఇక ప్రస్తుతం షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకున్న ‘ద 100’ చిత్రం.. త్వరలో థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఇక మొగలిరేకులు సీరియల్ లో ఆర్కే నాయుడిగా అందరి మన్ననలు అందుకున్న ‘సాగర్’.. సినిమాలో పోలీస్ క్యారక్టర్ లో ఏ రకంగా ఆకట్టుకుంటాడో వేచి చూడాలి. అయితే, ఈ సినిమా డేట్ ను త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి, సీరియల్ యాక్టర్ సాగర్ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘ది 100’ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetticket girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş