iDreamPost
android-app
ios-app

మొగలి రేకులు సాగర్ భార్యని ఎప్పుడైనా చూశారా? హీరోయిన్స్ కూడా పనికిరారు!

  • Published Apr 11, 2024 | 3:28 PM Updated Updated Apr 11, 2024 | 3:28 PM

జెమిని టీవీల్లో ప్రసారమైన చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. హీరో సాగర్‌.. మొగలి రేకులు సీరియల్‌తోనే మహిళా అభిమానుల మనసుల్ని దోచేశాడు. హీరో రేంజ్ క్రేజ్ ఏర్పడింది. మరీ ఈ బుల్లితెర గ్రీకు వీరుడు భార్యను చూశారా..?

జెమిని టీవీల్లో ప్రసారమైన చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. హీరో సాగర్‌.. మొగలి రేకులు సీరియల్‌తోనే మహిళా అభిమానుల మనసుల్ని దోచేశాడు. హీరో రేంజ్ క్రేజ్ ఏర్పడింది. మరీ ఈ బుల్లితెర గ్రీకు వీరుడు భార్యను చూశారా..?

  • Published Apr 11, 2024 | 3:28 PMUpdated Apr 11, 2024 | 3:28 PM
మొగలి రేకులు సాగర్  భార్యని ఎప్పుడైనా చూశారా? హీరోయిన్స్ కూడా పనికిరారు!

బుల్లితెరపై సీరియల్స్‌లో నటిస్తూ హీరో రేంజ్ పాపులారిటీని తెచ్చుకోవచ్చునని నిరూపించిన నటుడు సాగర్. జెమిని టీవిలో వచ్చే సీరియల్స్ అంటే మంజుల నాయుడు అనేట్లుగా ఉండేవి. చక్రవాకం సీరియల్ వస్తుందంటే టీవీలకు అత్తుకుపోయేవాళ్లు మహిళలు. మొగలి రేకులు ధారా వాహిక సెన్సేషనల్ హిట్ అందుకుంది. ‘ఎందుకో నాకు ఈ ఆశలు.. ఎందుకో నాకు ఈ ఆశలు.. మనసా మనసా నువు పాడలేవులే’ ‘విరిసి విరిసే మొగలి రేకులు’ అంటూ సాగిపోయే పాటలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ రెండు సీరియల్లో హీరోగా నటించాడు సాగర్. చక్రవాకం సీరియల్లో మధ్యలో నుండి ఎంట్రీ ఇస్తుంది ఈ క్యారెక్టర్ కానీ మొగలి రేకులు సీరియల్లో అతడిదే ప్రధాన పాత్ర.. డ్యూయల్ రోల్ నటించాడు. ఇందులో మున్నా, దేవి లవ్ ట్రాక్ చాలా మంది ఇష్టపడ్డారు. ఇక ఆర్కేగా పోలీసాఫీసర్ పాత్రలో లీనమైపోయాడు.

ఈ సీరియల్లో ఆర్కేగా, మున్నాగా మెస్మరైజ్ చేశాడు సాగర్. నిజాయితీ గల పోలీసాఫీసర్ పాత్రలో, అలాగే రౌడీగా మున్నా పాత్రలో తనదైన స్టైల్లో మెప్పించాడు. ఈ ధారావాహిక దెబ్బకు మరో సీరియల్ చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. విపరీతమైన టీర్పీని సొంతం చేసుకుంది ఈ ధారా వాహిక. సాగర్‌కు హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది. పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి, భర్త, ప్రేమికుడు కూడా అతడిలా ఉండాలనే అనుకునే వారు అప్పటి అమ్మాయిలు. మహిళలు, అమ్మాయిల మనస్సు దోచేసిన ఈ బుల్లి తెర గ్రీకు వీరుడికి.. బుల్లితెర సూపర్ స్టార్ అయిపోయాడు. సెలబ్రిటీలను తోసిపుచ్చి మరీ అతడితో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడేవారట. ఇదే ఇమేజ్ కారణంగా పలు అవకాశాలు కూడా వచ్చాయి. మిస్టర్ ఫర్ ఫెక్ట్ మూవీలో ప్రభాస్ స్నేహితుడిగా నటించాడు. ఆ తర్వాత హీరోగా మారాడు .. షాదీ ముబారక్ అనే సినిమాతో అలరించాడు.

మరీ ఇంతడి స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ స్మాల్ స్క్రీన్ హీరో గురించి తెలుసు కానీ.. ఆయన భార్య గురించి ఎవరికీ తెలియదు. కానీ ఆయన భార్య పేరు సౌందర్య. 2017లో వీరికి వివాహం అయ్యింది. ఆమె చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్లను మించిపోయే బ్యూటీ ఆమె సొంతం. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. విహాన్ అనే కొడుకు ఉండగా.. రెండేళ్ల క్రితం ఓ పాప పుట్టింది.ఆ పాప పేరు ఐరా. ఇక సౌందర్యను చూస్తే ఇద్దరు బిడ్డల తల్లిలా కనిపించదు. ఆమె బిజినెస్ ఉమెన్ కూడా. డిజైనర్ పార్టీవేర్ శారీస్ పేరుతో బిజినెస్ రన్ చేస్తోంది. అప్పుడప్పడు వాటికి ప్రమోటర్‌గా వ్యవహరిస్తుంటారు సాగర్. తన సోషల్ మీడియా వేదికగా వ్యాపారం, పిల్లలు, హస్బెండ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం సాగర్ 100 అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరవబోతున్నాడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Aatman The Label | Designer Partywear Sarees @partywearsaree (@designer_partywear_saree)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabet