iDreamPost
android-app
ios-app

‘మీర్జాపూర్’ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. సీజన్ 3పై హింట్ ఇచ్చిన బీనా ఆంటీ!

  • Author singhj Updated - 10:27 PM, Wed - 12 July 23
  • Author singhj Updated - 10:27 PM, Wed - 12 July 23
‘మీర్జాపూర్’ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. సీజన్ 3పై హింట్ ఇచ్చిన బీనా ఆంటీ!

కరోనా వల్ల ఎన్నో రంగాలు అతలాకుతలమయ్యాయి. కొవిడ్ వల్ల ప్రభావితమైన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఉంది. వైరస్​కు భయపడి అప్పట్లో దాదాపు అన్ని సినిమాల షూటింగులు ఆగిపోయాయి. ధైర్యం చేసి షూటింగ్ చేసినా చాలా మందికి వైరస్​ సోకింది. దీంతో అందరూ చిత్రీకరణ ఆపేశారు. రిలీజ్​కు రెడీగా ఉన్న సినిమాలు థియేటర్లలో వేస్తే వచ్చేందుకు ప్రేక్షకులు సిద్ధంగా లేని పరిస్థితి. దీంతో అందరూ ఓటీటీల బాటపట్టారు. మరో ఐదారేళ్ల తర్వాత ఊపు వస్తుందని అనుకున్న ఓటీటీ బిజినెస్​ కాస్తా.. కరోనా పుణ్యమాని ముందే బూమ్​లోకి వచ్చింది. కొవిడ్ టైమ్​లో అందరూ ఓటీటీలకు అలవాటు పడ్డారు.

కరోనా సమయంలో అందరికీ ఓటీటీలు పెద్ద కాలక్షేపంగా మారాయి. వరల్డ్​ మూవీస్​కు సంబంధించిన మూవీస్, వెబ్ సిరీస్​లను చూస్తూ గడిపేశారు. అప్పుడే ఇండియన్ మూవీ లవర్స్​కు వెబ్​ సిరీస్​ల్లో ఉండే మజా ఏంటో తెలిసొచ్చింది. బెస్ట్ వెబ్ సిరీస్​లు, మూవీస్​కు అలవాటు పడిన మన ఆడియెన్స్.. భారతీయ చిత్రాలు, వెబ్ సిరీస్​ల నుంచి అదే స్థాయి కంటెంట్​ను కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వెబ్ సిరీస్​లకు మంచి డిమాండ్ ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కూడా వాటిపై ఫోకస్ పెట్టారు. అయితే మన దేశంలో తెరకెక్కిన వెబ్ సిరీస్​ల్లో సూపర్ హిట్ అయిన వాటిని వేళ్ల మీదే లెక్కపెట్టొచ్చు. అలాంటి అరుదైన హిట్ సిరీస్​ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. హిందీలో రూపొందిన ఈ వెబ్ సిరీస్​ తెలుగులోనూ సూపర్ హిట్ అయింది.

‘మీర్జాపూర్’ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్​కు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఈ సిరీస్​ సీక్వెల్​ను కూడా అభిమానులు మొదటి సీజన్ రేంజ్​లోనే ఆదరించారు. మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా క్యారెక్టర్లు.. వాళ్లు చెప్పిన డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. దీంతో ఈ సిరీస్ మూడో సీజన్ కోసం వెయిటింగ్ ఎక్కువైపోయింది. వారి కోసమే అన్నట్లు ఇందులో బీనా ఆంటీ పాత్ర పోషించిన రసికా దుగల్ సూపర్ అప్​డేట్​ ఇచ్చారు. త్వరలోనే ‘మీర్జాపూర్’ మూడో సీజన్ ఉంటుందని ఆమె హింట్ ఇచ్చారు. అంతేగాక తాను డబ్బింగ్ చెబుతున్న ఒక ఫొటోను పోస్ట్ చేశారు. కాగా, ఈ సిరీస్ మూడో సీజన్ షూటింగ్ చాన్నాళ్ల కిందే పూర్తయిందట. అయితే మేకర్స్ మాత్రం ఇంకా రిలీజ్ టైమ్ ఫిక్స్ చేయలేదు. మరి.. ‘మీర్జాపూర్ సీజన్ 3’ కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rasika (@rasikadugal)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoney girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş