iDreamPost
android-app
ios-app

విచారణలో పవిత్ర గౌడ సంచలన నిజాలు! దర్శన్ పై కోపంతోనే అంటూ!

రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు దర్శన్, పవిత్ర గౌడ. ఇప్పటికే నిందితులపై చార్జీషీట్ దాఖలు చేశారు. ఇందులో వారి వాంగ్మూలాన్ని పొందుపరిచారు. పవిత్ర ఏమన్నదంటే..?

రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు దర్శన్, పవిత్ర గౌడ. ఇప్పటికే నిందితులపై చార్జీషీట్ దాఖలు చేశారు. ఇందులో వారి వాంగ్మూలాన్ని పొందుపరిచారు. పవిత్ర ఏమన్నదంటే..?

విచారణలో పవిత్ర గౌడ సంచలన నిజాలు! దర్శన్ పై కోపంతోనే అంటూ!

రేణుకా స్వామి హత్యకు సంబంధించి కన్నడ సూపర్ స్టార్, డీ బాస్ దర్శన్, ఆయన ప్రియురాలు, మరో 15 మందిని నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. తొలుత పరప్పన్ జైలులో ఉండగా.. అక్కడ దర్శన్ విలాసవంతమైన జీవితం గడుపుతున్న వీడియో లీక్ కావడంతో ఆయన్ను బళ్లారి జైలుకు తరలించారు. ఇతర నిందితులను మైసూరు, తమకూరు, షిమోగా, ధార్వాడ్, బెల్గాం, విజయపుర, కలబురిగి జైళ్లకు పంపించారు. కాగా, ఈ కేసులో పవిత్ర గౌడ ఏ1, దర్శన్ ఏ2గా పేర్కొన్నారు. అలాగే 3,991 పేజీలతో చార్జీషీట్ దాఖలు చేశారు. నిందితుల నుండి వాంగూల్మాన్ని చార్జీషీటులో పేర్కొన్నారు. ఈ క్రమంలో దర్శన్ రేణుకా స్వామిని తానే చంపినట్లు నేరం అంగీకరించాడు. తల, మెడ, చేతులు, ఛాతిపై చెక్కతో కొట్టినట్లు తెలిపాడు.

దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ తనకు హీరోతో ఏర్పడిన రిలేషన్‌షిప్ గురించి విచారణలో వెల్లడించగా.. వాటిని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. బుల్ బుల్ అనే సినిమా ఆడిషన్స్ జరుగుతున్నసమయంలో తెలిసిన మేనేజర్ ద్వారా దర్శన్ నంబర్ దొరికిందని, అలా అతనితో పరిచయం ఏర్పడిందని చెప్పింది. అయితే ఆ సినిమా ఆడిషన్ అయిపోవడంతో మరో మూవీ ఛాన్సు ఏమైనా ఉంటుందా అని అడిగిందట. అయితే అతడికి అప్పటికే పెళ్లయ్యిందన్న విషయం తనకు తెలియదని, దీంతో నిత్యం అతడితో చాట్స్, మేసెజెస్ చేసినట్లు పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత దర్శన్ భార్య విజయ లక్ష్మీ విషయం తెలిసిందని, అప్పటికే అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయానని వెల్లడించింది. అంతేకాదు.. ఓ సంవత్సరం మే 19న తన పెళ్లి రోజును ఘనంగా జరుపుకునేందుకు విజయలక్ష్మీని తీసుకుని దుబాయ్ విహార యాత్రకు వెళ్లాడట దర్శన్.

ఆమెతో దుబాయ్ వెళ్లే విషయం తనకు చెప్పలేదని, దీంతో తనకు కోపం వచ్చిందని, ఆ సమయంలోనే దర్శన్‌తో మాట్లాడలేదని పేర్కొంది. ఇదే సమయంలో చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి తనకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని, ఈ విషయం దర్శన్‌కు తెలియదని చెప్పింది. ‘కేఎస్ గౌతమ్ 1990′ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఓ వ్యక్తి నాకు చాలా అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు పంపాడని చెప్పింది. దర్శన్‌పై కోపంతో పవన్ అనే సన్నిహితుడికి రేణుక స్వామిని తన వద్దకు తీసుకురావాలని చెప్పానని తెలిపింది. కానీ పవన్ ఈ విషయాన్ని దర్శన్‌కు చెప్పడంతో ఇంత దాకా వచ్చిందని వెల్లడించింది. ఇదంతా ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కాగా, బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా కస్టడీ ముగియగా.. సెప్టెంబర్ 12 వరకు వీరి కస్టడీ పొడిగించింది స్థానిక కోర్టు. బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.