iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: ఎన్టీఆర్ దేవర చిత్ర యూనిట్ లో ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్

  • Published May 06, 2024 | 7:53 PM Updated Updated May 06, 2024 | 7:53 PM

దేవర షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అక్కడే ఉన్నారా?

దేవర షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అక్కడే ఉన్నారా?

  • Published May 06, 2024 | 7:53 PMUpdated May 06, 2024 | 7:53 PM
బ్రేకింగ్: ఎన్టీఆర్ దేవర చిత్ర యూనిట్ లో ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్

సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదాలు జరగడం అనేది సహజమే. సినిమా హీరోలు రిస్కీ షాట్స్ చేస్తున్నప్పుడు, టఫ్ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి. బైక్ వేగంగా నడిపే సీన్స్ లో, ఛేజింగ్ సీన్స్ అప్పుడు రిస్క్ ఎక్కువ. సినిమా హీరోలు డూప్ పెట్టుకునే ఛాన్స్ ఉన్నా గానీ అభిమానుల కోసం రిస్క్ అయినా పర్లేదని చేస్తున్నారు. ఈ క్రమంలో గాయాలపాలవుతున్నారు. దెబ్బలు తగిలితే ట్రీట్ మెంట్ చేయించుకుని తిరిగి మళ్ళీ రిస్కీ షాట్స్ చేస్తారు. మన హీరోలకి ఉన్న డెడికేషన్ అటువంటిది. తాజాగా దేవర మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైనా అయిందేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలేమైందంటే?

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ మూవీని నందమూరి కళ్యాణ్ రామ్ యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ దేవర మరొక ఎత్తు అనేలా ఉంది లుక్ చూస్తుంటే. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 20 మంది యూనిట్ సభ్యులకి గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే గమనించి చిత్ర బృందాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తారక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో తారక్ కి ఏమైందో అని కంగారు పడుతున్నారు.

ఆ సమయంలో షూట్ లో తారక్ ఉన్నారా? లేరా? అని టెన్షన్ పడుతున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. ఇక ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇది రెండవ చిత్రం. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ మాసివ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ తో అదిరిపోయే సబ్జెక్ట్ రెడీ చేశారు. చూస్తుంటే ఇద్దరూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా ఉన్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ అందాల తార జాన్వీకపూర్ నటిస్తోంది.    

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibombetcio girişiptv satın alCasibom