iDreamPost
android-app
ios-app

ఆల్ టైం గ్రేట్ ఫిల్మ్ మెగాస్టార్ అంజి

Anji Telugu Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందులోను వింటేజ్ చిరు ఫిలిమ్స్ అన్ని ఆల్ టైం బెస్ట్ రికార్డ్స్ గా ఎప్పటికి నిలిచిపోతాయి. అయితే ఇప్పటి హనుమాన్ కు కనెక్ట్ అయ్యేలా అప్పటి చిరు చిత్రాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఓ చిత్రం "అంజి".

Anji Telugu Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందులోను వింటేజ్ చిరు ఫిలిమ్స్ అన్ని ఆల్ టైం బెస్ట్ రికార్డ్స్ గా ఎప్పటికి నిలిచిపోతాయి. అయితే ఇప్పటి హనుమాన్ కు కనెక్ట్ అయ్యేలా అప్పటి చిరు చిత్రాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఓ చిత్రం "అంజి".

ఆల్ టైం గ్రేట్ ఫిల్మ్ మెగాస్టార్ అంజి

మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమా విడుదలై సరిగ్గా మొన్న జనవరి 15వ తేదీకి 23 ఏళ్ళు పూర్తయింది. 2004, జనవరి 15వ తేదీన విడుదలైన అంజి.. విడుదలైనప్పుడు గొప్ప విజయాన్ని సాధించలేకపోయింది. దానికి కారణాలు సవాలక్ష. మేకింగ్ టైం టూ లాంగ్ అయింది. ముందు విఐపి సినిమాతో విజువల్స్ బాగా తీశాడని దర్శకుడు సభాపతిని పెట్టారు. తర్వాత మధ్యలో సురేష్ క్రిష్ణ వచ్చారు. చివరిగా కోడి రామక్రిష్ణ చేతిలోకి వచ్చింది ప్రాజెక్టు. తరువాతి దశలో హెవీ గ్రాఫిక్ వర్క్ ఇన్వాల్వ్ కావడం వల్ల చాలా కాలం దానికి పట్టేసింది. చిరంజీవి అయితే ఒకే డ్రస్ రెండేళ్ళ పాటు వేసుకుని గ్రాఫిక్స్ నిమిత్తం షూట్ చేశారు.

ఇక అన్నపూర్ణ స్టూడియోలో ఎప్పుడూ ఒకే డ్రెస్ లో కనిపించేవారు చిరంజీవి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ .. చిరంజీవిగారితో ఆల్ టైం క్లాసిక్, హిస్టరీలో నిలబడిపోయే సినిమా తీయాలనేదే తన ధ్యేయం అని చెప్పేవారు. నిజమే ఆరోజున చిరంజీవి డేట్స్ ఉన్నప్పుడు.. మాస్ కమర్షియల్ సినిమా ఒకటి ప్లాన్ చేసుకుని ఉంటే శ్యాంకి కోట్లు మిగిలి ఉండేవి. అంత ప్రయాస కూడా అక్కర్లేదు. కానీ తన కలని నిజం చేసుకునే ప్రయత్నంలో శ్యాం అన్ని ఒడిదుడుకులను తట్టుకుని, ఆయన ఆలోచనకి వంత పాడుతూ చిరంజీవి తీసుకున్న శ్రమ, చూపించిన సహనంతోనే అంజి సినిమా జరిగింది.

కాగా అమెరికా ఎన్నో సార్లు వెళ్ళి, అక్కడ క్రిష్ అనే గ్రాఫిక్ ఎక్స్ పర్ట్ ని పట్టుకుని అంజి సినిమా వర్క్ అప్పగించారు శ్యాం. ఈరోజున ఉన్నంత అడ్వాన్స్ మెంట్ ఆరోజున గ్రాఫిక్స్ ప్రపంచంలో రాలేదు. ఈ రోజు గ్రాఫిక్స్ అంటేనే హైదరాబాద్. అలా దాదాపు 5 ఏళ్లు పట్టి, చివరికి జనవరి 15న విడుదలైన అంజికి తగినంత ప్రోత్సాహం ప్రేక్షకుల నుంచి లభించలేదన్నది చరిత్ర. తర్వాతి రోజులలో అంజి సినిమా విడుదలైనప్పుడు చిన్నవయసులో ఉన్నవాళ్ళకి ఏజ్ వచ్చి, అంజిని చూసి మెచ్చుకోవడం మొదలు పెట్టారు. అందులో కథని, దర్శకుడు కోడిరామక్రిష్ణ డైరెక్టోరియల్ ఎక్స్ లెన్స్ ని, చిరంజీవి ఛరిష్మాని, గ్రాఫిక్స్ ని ఉపయోగించిన విధానాన్ని చూసి అంజి పిచ్చిలో పడిపోయారు. ఎప్పుడైతే వెస్ట్రన్ ఫిల్మ్స్ చూడ్డం అలవాటైన ప్రేక్షక తరం మొదలయ్యిందో.. అప్పుడు అంజి గొప్పతనం మనవాళ్ళకి తెలిసొచ్చింది.

ఇక ఇప్పుడు అంజిని కల్ట్ ఫిల్మ్ అంటున్నారు. ఎన్నిసార్లు టీవీల్లో వచ్చినా అన్నిసార్లు వెర్రెక్కి చూస్తున్నారు. ప్రత్యేకంగా వీడియోలు పనిగట్టుకుని,పదేపదే చూస్తున్నారు. ఇప్పుడు అంజి ఒక చిత్రలోకపు అపరంజి స్వప్నం. అందుకే దర్శకుడు కోడి రామక్రిష్ణ అంజి సినిమాని ఆల్ టైం గ్రేట్ ఫిల్మ్ బెన్హర్ తో పోల్చారు. ఎప్పటికైనా సరే అంజి గొప్ప సినిమాగానే నిలిచిపోతుందని ధైర్యంగా చెప్పారు. ఆయన మాటలే నిజమయ్యాయి. చిరంజీవిని కిడ్స్ బాగా లవ్ చేస్తారని, అందుకు కిడ్స్ కూడా చూసి ఎంజాయ్ చేసే సినిమా తీయడానికే.. తన ప్రయత్నమంతా అని ఆరోజు శ్యాం ప్రసాద్ రెడ్డి చెప్పిన మాటలు ఎప్పటికీ నిజాలే. కొత్తగా మొన్ననే రిలీజైన హనుమాన్ సినిమాకి అంజి సినిమాయే స్ఫూర్తి, ప్రేరణ అని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. నిజమేనేమో.