iDreamPost
android-app
ios-app

తారక్‌కు జోడీగా మరో బ్యూటీ.. మరింత అందంగా..!

  • Published Feb 09, 2024 | 8:02 PM Updated Updated Feb 09, 2024 | 8:02 PM

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత తారక్ నటిస్తోన్న చిత్రం దేవర. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న సంగతి విదితమే. ఇప్పటికీ సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత తారక్ నటిస్తోన్న చిత్రం దేవర. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న సంగతి విదితమే. ఇప్పటికీ సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

  • Published Feb 09, 2024 | 8:02 PMUpdated Feb 09, 2024 | 8:02 PM
తారక్‌కు జోడీగా మరో బ్యూటీ.. మరింత అందంగా..!

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెరపై కనిపించలేదు. ఆయన్ను థియేటర్లలో చూసుకుని రెండేళ్లకు దగ్గర కావస్తోంది. ఈ క్రమంలో జనతా గ్యారేజ్‌ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివతో దేవర చిత్రాన్ని షురూ చేశాడు యంగ్ టైగర్. దేవర పోస్టర్ రిలీజ్ చేయగానే పూనకాలు వచ్చాయి అభిమానులకు. ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. అయితే ఏప్రిల్ 5న పార్ట్ 1 విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ ఇతర కారణాల వల్ల వాయిదా పడింది. అయితే అది ఎప్పుడో అనేది క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆఱ్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. సుమారు 200-300 కోట్లతో సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయ్యింది. అయితే సైఫ్ అలీఖాన్ ప్రమాదం బారిన పడటం, వీఎఫ్ఎక్స్ వెరసి ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్ బరి నుండి తప్పుకుని దసరాకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇప్పుడొక ఇంట్రెస్టింగ్  అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో మరో హీరోయిన్ నటించబోతుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. అయితే ఓ క్యారెక్టర్‌ జోడికిగాను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకోగా.. ఇప్పుడు మరో ఫీమేల్ లీడ్ కోసం కొత్త నటి ఎంట్రీ ఇవ్వబోతుందట. గుజరాతి బ్యూటీ శృతి మరాఠే తారక్ సరసన ఆడి పాడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ఎన్టీఆర్ క్యారెకర్స్‌కు వీరిద్దరిని ఫిక్స్ చేశారట దర్శక నిర్మాతలు. ఇక శృతి విషయానికి వస్తే.. ఆమె ఈ మూవీలో కన్ఫమ్ అయినట్లయితే ఇది తొలి తెలుగు సినిమా కావొచ్చునేమో కానీ.. ఇప్పటికే నటిగా అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది. మరాఠీతో సహా తమిళ్, కన్నడ భాషల్లో డజనుకు పైగా సినిమాలు చేసింది బ్యూటీ. ఇప్పుడు ఈమె ఎంట్రీ ఇస్తే.. స్క్రీన్ మరింత అందంగా మారబోతుందన్న మాట.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş