iDreamPost
android-app
ios-app

అఫీషియల్: మంజుమ్మల్ బాయ్స్ తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?

  • Published Mar 26, 2024 | 6:32 PM Updated Updated Mar 26, 2024 | 6:32 PM

Mnjummel Boys Telugu Releases: మలయాళం ఇండస్ట్రీ టాప్ గ్రాసర్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో రిలీజ్ కాబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతోంది అంటే?

Mnjummel Boys Telugu Releases: మలయాళం ఇండస్ట్రీ టాప్ గ్రాసర్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో రిలీజ్ కాబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతోంది అంటే?

  • Published Mar 26, 2024 | 6:32 PMUpdated Mar 26, 2024 | 6:32 PM
అఫీషియల్: మంజుమ్మల్ బాయ్స్ తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?

మలయాళం ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్స్ చాలానే వచ్చాయి. వాటిలో బాగా వినిపించిన పేరు మంజుమ్మల్ బాయ్స్ అనే చెప్పాలి. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా చాలా పెద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఇంత మంచి టాక్ వచ్చిన మూవీ, బ్లాక్ బస్టర్ అయిన మూవీని థియేటర్లోనే చూడాలి అని చాలామందికి ఉంది. ఇప్పుడు వారందరి కోరిక తీరబోతోంది. ఎందుకంటే మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వర్షన్ లో కూడా రిలీజ్ కాబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇటీవల మలయాళం సినిమా ప్రేమలు పాన్ ఇండియా లెవల్లో తెగ వైరల్ అయ్యింది. ఆ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయమని తెలుగు ప్రేక్షకులు పెద్దఎత్తున రిక్వెస్టులు చేశారు. ఇంకేముంది.. తెలుగు వర్షన్ ని కూడా థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇలాగే మంజుమ్మల్ బాయ్స్ సినిమా కూడా తెలుగులో రిలీజ్ చేస్తే బాగుంటుందని చాలామంది ఆడియన్స్ కోరుకున్నారు. ఇప్పుడు వారి కోరిక తీర్చేందుకు మైత్రీ మూవీ మేకర్స్ నడుంబిగించారు. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో తెలుగు వర్షన్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ మూవీకి తెలుగు వర్షన్ ను ఏప్రిల్ 6న విడుదల చేయబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు.

మంజుమ్మల్ బాయ్స్ తెలుగు రిలీజ్ వార్త విన్న తర్వాత తెలుగు ఆడియన్స్ తెగ ఆనంద పడిపోతున్నారు. ఒక సినిమాకి హిట్టు టాక్ వచ్చిన తర్వాత కచ్చితంగా చూడాలి అనుకుంటారు. కానీ, వచ్చీరాని భాషలో చూసిన దానికంటే తెలుగులో చూస్తేనే థ్రిల్ ఉంటుంది. ఈ భావన చాలామందిలో ఉన్నదే. ఇప్పుడు వారందరి కోరిక నెరవేరబోతోంది. ఏప్రిల్ 6న మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వర్షన్ థియేటర్లలో విడుదల కాబోతోంది. మంజుమ్మల్ బాయ్స్ కథ విషయానికి వస్తే.. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన సినిమా. 2006లో కొచ్చికి దగ్గర్లోనే మంజుమ్మల్ అనే గ్రామానికి చెందిన మొత్తం 11 మంది స్నేహితుల బృందం ట్రిప్పుకు వెళ్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

మంజుమ్మల్ బాయ్స్ కొడైకెనాల్ చూసేందుకు వెళ్తారు. అక్కడ ఉండే గుణ కేవ్స్ కి వెళ్తారు. అలాగే అందులో ఉండే అనుమతిలేని ప్రదేశాలను కూడా వాళ్లు ఎక్స్ ప్లోర్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అలా చూసే క్రమంలో వారిలో ఒకళ్లు గుహలో ఉన్న సొరంగంలో పడిపోతారు. అతడిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ కూడా ముందుకు రాదు. కానీ, ఫ్రెండ్స్ తమ మిత్రుడిని కాపాడేందుకు నిర్ణయించుకుంటారు. మరి.. ఫ్రెండ్స్ అంతా కలిసి తమ మిత్రుడిని కాపాడుకున్నారా? అసలు అతను బతికే ఉంటాడా? రెస్క్యూ టీమ్ కూడా ఎందుకు సాహసం చేయలేకపోయింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే మంజుమ్మల్ బాయ్స్ ని ఏప్రిల్ 6న థియేటర్లలో చూడాల్సిందే. మరి.. మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో విడుదల కానుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabet