హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ యాక్ట్ చేసిన ‘మంగళవారం’ సినిమా బిగ్ స్క్రీన్స్‌లోకి వచ్చేస్తోంది. విడుదలకు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ నెలకొంది.
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ యాక్ట్ చేసిన ‘మంగళవారం’ సినిమా బిగ్ స్క్రీన్స్‌లోకి వచ్చేస్తోంది. విడుదలకు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ నెలకొంది.
ఒకే సినిమాతో ఓవర్‌నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న డైరెక్టర్‌గా అజయ్ భూపతిని చెప్పుకోవచ్చు. ఆయన తీసిన ‘ఆర్ఎక్స్ 100’ ఫిల్మ్ సంచలన విజయాన్ని సాధించింది. యూత్‌తో పాటు మాస్ ఆడియెన్స్ ఆదరించడంతో ఎక్స్పెక్ట్ చేయని విధంగా కలెక్షన్స్ సాధించిందా సినిమా. ‘ఆర్ఎక్స్ 100’ సక్సెస్‌తో పాయల్ రాజ్‌పుత్, కార్తికేయలు లైమ్‌లైట్‌లోకి వచ్చారు. వీళ్లిద్దరికీ వరుస ఛాన్సులు క్యూ కట్టాయి. డైరెక్టర్ అజయ్ భూపతికి కూడా భారీ ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో శర్వానంద్, సిద్ధార్థ్‌తో ‘మహాసముద్రం’ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారాయన. ఈ చిత్రంలో పెద్ద స్టార్లు నటిస్తారనే వార్తలు వచ్చినా.. ఆఖరికి శర్వా, సిద్ధూలతో మూవీ తెరకెక్కింది. అయితే ఈ ఫిల్మ్ రిజల్ట్ మాత్రం అజయ్ భూపతిని తీవ్రంగా నిరాశపర్చింది.
‘మహా సముద్రం’ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న అజయ్ భూపతి తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు మళ్లీ చిన్న సినిమా తీయాలని సెలెక్ట్ అయ్యారు. ఈసారి కూడా పాయల్ రాజ్‌పుత్‌నే ప్రధాన పాత్రకు తీసుకొని ‘మంగళవారం’ అనే మూవీని రూపొందించారు. ఈ నెల 17న థియేటర్లలోకి రానున్న ఈ ఫిల్మ్ డిజిటల్ ప్రీమియర్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటం, పాయల్-అజయ్ భూపతి కాంబో రిపీట్ కానుండటంతో ‘మంగళవారం’ రైట్స్‌ను దక్కించుకునేందుకు ఓటీటీ కంపెనీలు పోటీపడ్డాయని టాక్. రిలీజ్‌కు ముందే ఈ మూవీ సేఫ్ జోన్లోకి వెళ్లిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
‘మంగళవారం’ మీద ఆడియెన్స్‌లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే డైరెక్టర్ అజయ్ భూపతి వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఈ సినిమాకు నెగెటివ్‌గా మారే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. గత చిత్రం ‘మహాసముద్రం’ టైమ్‌లో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ను భారీగా పెంచేశారు అజయ్ భూపతి. బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో డైలాగులు కొట్టారు. తీరా సీన్లోకి వస్తే సినిమాకు ఫ్లాప్ టాక్. ఇప్పుడు ‘మంగళవారం’ విషయంలోనైతే ఆయన మరింత అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా వేరే లెవల్లో ఉంటుంది, ట్విస్టులు అదిరిపోతాయంటూ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో పాటు ఇంటర్వ్యూల్లో ఊదరగొడుతున్నారు.
‘మంగళవారం’ సినిమాపై ప్రేక్షకులతో పాటు మూవీ గోయర్స్లోనూ మంచి బజ్ ఉంది. కాబట్టి థియేటర్‌కు వెళ్లాక ఫిల్మ్ బాగుంటే పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రిలీజ్ తర్వాత డైరెక్షన్, రైటింగ్ స్కిల్స్, టెక్నికల్ పాయింట్స్, యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పుకుంటే పబ్లిసిటీ అవుతుంది. కానీ విడుదలకు ముందే ఇలా అంచనాలు పెంచేస్తే.. సినిమా ఆ రేంజ్లో ఉండకపోతే మాత్రం మరో ‘మహా సముద్రం’ అయిపోద్దని నెటిజన్స్ హెచ్చరిస్తున్నారు. మరి.. ‘మంగళవారం’ ప్రమోషన్స్ విషయంలో అజయ్ భూపతి వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: జైలర్ విలన్‌పై గౌతమ్ మీనన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. పని చేయలేమంటూ..