iDreamPost

జైలర్ విలన్‌పై గౌతమ్ మీనన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. పని చేయలేమంటూ..

ఈ మధ్య టాలెంట్ డైరెక్టర్లంతా వరుసగా యాక్టర్లుగా మారిపోతున్నారు. దీంతో డైరెక్షన్ వైపు కాస్త వెనకబడుతున్నారు. అటువంటి వారిలో గౌతమ్ వాసు దేవ మీనన్ ఒకరు. ఎప్పుడో తెరకెక్కించిన ధ్రువ నక్షత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సమయంలో..

ఈ మధ్య టాలెంట్ డైరెక్టర్లంతా వరుసగా యాక్టర్లుగా మారిపోతున్నారు. దీంతో డైరెక్షన్ వైపు కాస్త వెనకబడుతున్నారు. అటువంటి వారిలో గౌతమ్ వాసు దేవ మీనన్ ఒకరు. ఎప్పుడో తెరకెక్కించిన ధ్రువ నక్షత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సమయంలో..

జైలర్ విలన్‌పై గౌతమ్ మీనన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. పని చేయలేమంటూ..

ఒకే ఒక్క సినిమా అతడి ఫేట్ మార్చింది. దీంతో బిజీయెస్ట్ విలన్‌గా మారిపోయాడు. 1995 నుండి పరిశ్రమలో కొనసాగుతున్న అతడికి మంచి పేరు తెచ్చింది మాత్రం రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన జైలర్ మూవీతోనే. ఇది తెలుగులో కూడా భారీ హిట్ అందుకుంది. వర్మ అనే క్యారెక్టర్లలో జీవించాడని చెప్పొచ్చు. బేసికల్లీ మలయాళ నటుడు అయిన ఇతడు.. మాలీవుడ్‌లో అందరికీ సుపరిచితమే. అతడు కేవలం నటుడే కాదూ కంపోజర్ కూడా. తెలుగులో కూడా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అసాధ్యుడు మూవీలో విలన్‌గా కనిపించాడు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవ నక్షత్రంలో కనిపించబోతున్నాడు.

ఈ నెల 24న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్. ఈ చిత్రంలో వినాయకన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా అతడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్. వినాయకన్ సరికొత్తగా చూస్తారని, మరే సినిమాలో కనిపించనంత స్టైలిష్‌గా ఉంటారని అన్నారు. అదే సమయంలో వినాయకన్‌తో పనిచేయడం చాలా కష్టమని అన్నారు. ‘వినాయకన్‌ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే క్యారెక్టర్ స్టైల్, కాస్ట్యూమ్, క్యారెక్టర్‌కి ఎలాంటి మూడ్ ఇవ్వాలనుకుంటున్నానో ప్రతిది అతడికి తెలియాలని డిమాండ్ చేస్తాడు. అలా అని వినాయకన్ నటన తనపై ప్రభావితం చేస్తుందని హీరో విక్రమ్ ఎప్పుడు భయపడలేదు. చాలా కూల్‌గా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. వినాయకన్‌కి చాలా సన్నివేశాలకు మేకప్ వేశారు విక్రమ్’ అని తెలిపారు.

యాక్షన్ సన్నివేశాల్లో ఏం చేయాలి, ఎలా చేయాలని వీరిద్దరూ అన్నీ చర్చించుకున్నారని, ఇలాంటి నటీనటులు దొరకడం చాలా అదృష్టమని, హడావుడి లేకుండా కోరుకున్న ఇన్ పుట్ ఇచ్చారన్నారు గౌతమ్ మీనన్. ‘ఈ సినిమాలో వినాయకన్ డైలాగ్స్, నటన, మ్యానరిజం తీరు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ సినిమాకు విలన్ అనుకుంటున్న సమయంలో దివ్యదర్శిని అతడి పేరు సూచించింది.  అతడి కెరీర్ లో ది బె స్ట్ మూవీ అవుతుంది. ఇటీవల డబ్బింగ్ కూడా చెప్పి వెళ్లిపోయాడు. కానీ నేను అతని నుండి మరో రోజు ఆశించా. కానీ దొరకలేదు. విక్రమ్ సార్ హీరోగా నటించడం నా అదృష్టం. ఈ సినిమా పట్ల అనిశ్చితి నెలకొన్నప్పుడు విక్రమ్‌కు కాల్ చేశా.. ఈ సినిమా సూర్య ఎందుకు నో చెప్పాడని, ఎందుకు మధ్యలో ఆపేయాల్సి వచ్చిందని నన్ను అడిగారు.. వివరించగా.. ఇంటికి రండి అన్నారు. కథ చెబితే, నచ్చింది ఓకే చేశారు. ఆ టైంలో డేట్స్ లేకపోయినా, ఈ ప్రాజెక్టు చేస్తానని హామీనిచ్చారు’అని దర్శకుడు అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి