Venu Swamy: నాగచైతన్య- శోభితల జాతకం చెప్పడంపై మంచు విష్ణు సీరియస్! మహిళా కమీషనర్‌కి ఫిర్యాదు!

నాగచైతన్య- శోభితల జాతకం చెప్పడంపై మంచు విష్ణు సీరియస్! మహిళా కమీషనర్‌కి ఫిర్యాదు!

జ్యోతిష్యం, హీరోయిన్లతో పూజలు చేయించి ఫేమ్ తెచ్చుకున్నాడు వేణు స్వామి. అయితే ఈ మధ్య కొన్ని జాతకాలు బెడిసి కొట్టడంతో తాను ఆస్ట్రాలజీ చెప్పనంటూ తెగేసి చెప్పిన ఆయన చైతూ-శోభిత నిశ్చితార్థం చేసుకోగానే..

జ్యోతిష్యం, హీరోయిన్లతో పూజలు చేయించి ఫేమ్ తెచ్చుకున్నాడు వేణు స్వామి. అయితే ఈ మధ్య కొన్ని జాతకాలు బెడిసి కొట్టడంతో తాను ఆస్ట్రాలజీ చెప్పనంటూ తెగేసి చెప్పిన ఆయన చైతూ-శోభిత నిశ్చితార్థం చేసుకోగానే..

అక్కినేని నాగ చైతన్య- సమంతలు విడిపోతారంటూ జ్యోతిష్యం చెప్పి ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి 2.0వర్షన్‌తో ముందుకు వచ్చాడు. సెలబ్రిటీలకు జాతకాలు చెప్పి, అలాగే హీరోయిన్లతో పూజలు చేయించి ఫేమ్ పొందిన ఆయన ఈ మధ్యకాలంలో చెప్పిన జోస్యం బెడిసి కొట్టడంతో ఇక జీవితంలో జాతకాలు చెప్పనంటూ తెగేసి చెప్పాడు. అయితే నాగ చైతన్య- శోభితా దూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ చేసుకోగానే.. వీరి జాతకం చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఇద్దరు కూడా జీవితంలో కలిసి ఉండరూ అంటూ చెప్పడంతో ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. వేణు స్వామిని తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. తెలుగు ఫిల్మ్ జరలిస్టుల అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ కలిసి వేణు స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిక్కుల్లో పడ్డారు వేణు స్వామి. దీంతో ఈ వివాదంపై వేణు స్వామి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిపై ఆయన ఏమన్నారంటే..? ‘

‘మూడురోజుల క్రితం నాగచైతన్య, శోభిత ధూళిపాళ జాతకాన్ని నేను విశ్లేషించాను. దానిపై తీవ్రమైన డిబేట్స్ సాగుతున్నాయి. నేను జాతకం చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే..? నేను ఇంతకు ముందు సమంత, నాగచైతన్య జాతకాన్ని చెప్పున్నాను కాబట్టి దానికి కొనసాగింపుగా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్పా, నేను మాట మీదనే ఉంటాను. నేను ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పనని, మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటాను. నేను జాతకాలు కంటిన్యూ చేయను. రెండు నెలల క్రితం నేను పెట్టిన వీడియోలో రాజకీయ విశ్లేషణలు కూడా చేయనని చెప్పాను. ఇప్పుడు ఈ జాతకం ఎందుకు చెప్పానంటే.. చైతూ- సామ్ విషయంలో జరిగింది కాబట్టి.. ఇది కొనసాగింపుగా చెప్పాను’ అని వెల్లడించాడు.

‘ఇప్పుడే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు జాతకాలు  చెబుతున్నారంటూ ప్రశ్నించాడు. నేను వారికి కూడా వివరించాను. ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు, రాజకీయ జ్యోతిష్యాలు, వ్యక్తిగత జాతకాలు చెప్పనని చెప్పాను. ఇప్పుడు చైతన్య జాతకం చెప్పడానికి కారణం.. గతంలో నేను సమంత-చైతు విషయంలో విడాకులు తీసుకుంటారని చెప్పాను. అది జరిగింది కాబట్టి..ఇప్పుడు కొనసాగింపుగా చెప్పాను. నేను ఇక మీదట నేను సెలబ్రిటీలు జాతకాలు చెప్పను. అదే మాట మీద ఉంటాను. సోషల్ మీడియాలో కూడా వేరేవారి జాతకాలను విశ్లేషించే ఉద్ధేశ్యం నాకు లేదు. విష్ణు కూడా కలుద్దామని అన్నారు. ఇకపై నా నుంచి సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు నా నుంచి ఆశించొద్దు. నేను చెప్పనని’ పేర్కొన్నాడు వేణు.

కాగా, మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మంచు విష్ణు.. సినిమా పరిశ్రమలోని వారికి ఎటువంటి కష్టం  వచ్చినా తోడుగా నిలబడటంతో పాటు మద్దతునిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కొంత మంది సినీ సెలబ్రిటీలను ముఖ్యంగా మహిళల్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్  చేయడంతో అటువంటి ఛానల్స్ పై యూట్యూబ్ సంస్థతో మాట్లాడి బ్యాన్ చేయించిన సంగతి విదితమే. ఇప్పుడు ఇలా తమ సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి జ్యోతిష్యం చెప్పడం పట్ల కూడా ఆయన స్పందించాడు.  తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ఇండస్ట్రీకి అండగా నిలబడుతున్నాడు విష్ణు.

 

Show comments