iDreamPost
android-app
ios-app

ప్రణీత్ హనుమంతు ఇష్యూపై మంచు విష్ణు రియాక్షన్.. 48 గంటలు టైం ఇస్తున్నా..

  • Published Jul 10, 2024 | 9:08 PM Updated Updated Jul 10, 2024 | 9:08 PM

Manchu Vishnu On Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతుని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మిగతా ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. కాగా ప్రణీత్ హనుమంతు అరెస్ట్ నేపథ్యంలో మంచు విష్ణు స్పందించారు. 48 గంటలు టైం ఇస్తూ ఆ బ్యాచ్ మొత్తానికి హెచ్చరికలు జారీ చేశారు.

Manchu Vishnu On Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతుని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మిగతా ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. కాగా ప్రణీత్ హనుమంతు అరెస్ట్ నేపథ్యంలో మంచు విష్ణు స్పందించారు. 48 గంటలు టైం ఇస్తూ ఆ బ్యాచ్ మొత్తానికి హెచ్చరికలు జారీ చేశారు.

  • Published Jul 10, 2024 | 9:08 PMUpdated Jul 10, 2024 | 9:08 PM
ప్రణీత్ హనుమంతు ఇష్యూపై మంచు విష్ణు రియాక్షన్.. 48 గంటలు టైం ఇస్తున్నా..

ప్రణీత్ హనుమంతు, డల్లాస్ నాగేశ్వరరావు సహా మరో ఇద్దరు వ్యక్తులు కలిసి డార్క్ కామెడీ పేరుతో చేసిన రచ్చ గురించి తెలిసిందే. తండ్రీ, కూతురు వీడియోకి సంబంధించి జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తూ శునకానందం పొందారు. ఈ వీడియో సాయి ధరమ్ తేజ్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. అంతే ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అందరూ ముక్తకంఠంతో ప్రణీత్ హనుమంతు అండ్ గ్యాంగ్ ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఇవాళ ప్రణీత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. కాగా ప్రణీత్ వివాదంపై మంచు విష్ణు స్పందించారు. 

సమాజంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడంతో మంచు ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటారు. ప్రణీత్ వివాదంలోనూ మంచు మనోజ్, మంచు లక్ష్మి సీరియస్ అవ్వగా తాజాగా మంచు విష్ణు కూడా స్పందించారు. తెలుగు వాళ్లంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు. మన ట్రెడిషన్స్ ఫాలో అవుతారని ప్రపంచమంతా అనుకుంటా ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో తెలుగు వాళ్ళు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లో అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకిలా ప్రవరిస్తున్నారన్న ప్రశ్న ఎదురవుతుందని అన్నారు. 

ప్రణీత్ హనుమంతు గురించి సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయడం.. సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులు వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు. ఒక మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ప్రణీత్ హనుమంతు, అతని ఫ్రెండ్స్ ఇలా ఎందుకు ప్రవర్తించారో అర్థం కావడం లేదని, అందులో ఆనందం ఏముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చంటి బిడ్డ గురించి నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మన తెలుగువాళ్ళం అలాంటి వాళ్ళము కాదు. ఆడవాళ్ళని సెక్సువల్ గానే చూడాలా? మీకు తల్లి, అక్క, చెల్లి, భార్య లేరా? అంటూ ఎమోషనల్ అయ్యారు. బ్రహ్మానందం కూడా తనకు కాల్ చేశారని.. ఆయన చాలా బాధపడ్డారని.. తన ఫోటోలను చెత్త మీమ్స్ కి వాడుతున్నారని.. ఇలాంటివాటిని ఆపాలని సూచించారని అన్నారు. ట్రోలింగ్ వీడియోస్ వేసే వారికి చెప్తున్నా.. హీరోయిన్స్ మీద, సినిమా వాళ్ళ మీద అసభ్యకర కామెంట్స్ చేస్తూ చేసిన వీడియోలను, ట్రోలింగ్ వీడియోస్ ని నా వీడియో బయటకు వచ్చిన 48 గంటల్లో తొలగించండి. లేదంటే మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş