iDreamPost
android-app
ios-app

మోహన్ బాబు మాస్ వార్నింగ్.. నా పేరు రాజకీయంగా వినియోగిస్తే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరో, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలు అందించిన ఆయన.. విద్యా వేత్తగా, రాజకీయ నేతగా పేరు పొందారు.. అయితే

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరో, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలు అందించిన ఆయన.. విద్యా వేత్తగా, రాజకీయ నేతగా పేరు పొందారు.. అయితే

మోహన్ బాబు  మాస్ వార్నింగ్.. నా పేరు రాజకీయంగా వినియోగిస్తే..

తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు గురించి తెలియని వారుండరు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ అందించి..కళామతల్లి సేవలోనే కొనసాగుతున్న ఆయనకు కలెక్షన్ కింగ్ అన్న బిరుదు కూడా ఇచ్చారు అభిమానులు. మోహన్ బాబు ముక్కసూటి గల మనిషని సినీ పరిశ్రమలో మాట్లాడుకుంటారు. ఏ విషయంలో అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన నైజం అంటుంటారు. నటుడిగానే కాదూ..ఆయనకు రాజకీయ అనుభవం కూడా ఉంది. అటు విద్యా సంస్థలు స్థాపించి.. ఎంతో మంది విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన కుమారుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్.. కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇలా ఉంటే..మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా ఓ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ఓ నోట్ పంచుకున్నారు. అందులో ‘ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అవి వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయడడంలోనే మనం దృష్టి పెట్టాలి గాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకు రావడం బాధాకం.

mohan babu mass warning

నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపించజేయండలో అందరం బద్దులై ఉందామని కోరుకుంటూ.. ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ’ అంటూ వార్నింగ్, రిక్వెస్ట్ తో కూడిన ఓ నోట్ పంచుకున్నారు. దీన్ని బట్టి చూస్తే.. ఆయన పేరును రాజకీయాల కోసం ఎవరో వినియోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం మోహన్ బాబు దృష్టికి వెళ్లడంతోనే ఇలా స్పందించినట్లు సమాచారం. కాగా, గతంలో టీడీపీలో ఉన్న ఆయన..ఆ తర్వాత ఆ పార్టీని వీడారు. 2019లో వైసీపీలో చేరిన ఆయన.. ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. కానీ  బీజెపీలో చేరాలంటూ  ఆయనకు ఆహ్వానం కూడా అందిందని అప్పట్లో ఊహాగానాలు అందాయి. ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ.. ఇప్పుడు పొలిటికల్‌గా ఆయన పేరు ఎవరు వినియోగిస్తున్నారో ఆ లేఖలో పొందుపర్చలేదు.