Keerthi
Manchu Manoj: మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా మంచు వారి ఇంట్లో మరో శుభకార్యంతో జరగడంతో అంత సందడి వాతవరణం నెలకొంది.
Manchu Manoj: మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా మంచు వారి ఇంట్లో మరో శుభకార్యంతో జరగడంతో అంత సందడి వాతవరణం నెలకొంది.
Keerthi
టాలీవుడ్ పరిశ్రమలో మంచు మోహన్ బాబు తనయుడుగా మంచు మనోజ్ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మనోజ్ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ పాలోయింగ్ ను సంపాదించుకున్నాడు . ఇదిలా ఉంటే.. మనోజ్ తన స్నేహితురాలైన భూమా మౌనికా రెడ్డిని గతేడాది మార్చి 3న ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. దాదాపు 15 ఏళ్ల వీరి పరిచయం కాస్త పెద్దలను ఒప్పించి వివాహాబంధంతో ఒకటయ్యారు. కాగా, వీరిద్దరికి ఇది రెండవ పెళ్లి కావడం విశేషం. పైగా మౌనికకు మనోజ్ తో పెళ్లికి ముందు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక పెళ్లైయిన కొన్నాళ్లకే తన భార్య గర్భవతి అంటూ చక్కటి శుభవార్తను తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. కాగా, తాజాగా మంచు వారి ఇంట్లో మరో శుభకార్యంతో సందడి వాతవరణం నెలకొంది.
మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంతోషం మరింత రెట్టింపు కానువది. వారి కుటుంబంలో ఇంకొన్ని నెలలలో మరో బుజ్జాయి రాబోతుందని కుటుంబం మొత్తం సంతోషంతో పొంగి పోతుంది. ఇక భూమా మౌనిక గర్భం దాల్చిన విషయం మనోజ్ అభిమానుల్లో పంచుకోవడమే కాకుండా.. మౌనిక కూడా ఇటీవలే తను బేబీ బంపుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మౌనిక ఏడో నెల గర్భవతి కావడంతో.. తాజాగా మౌనికకు అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య సింపుల్ గా నంద్యాలలో సీమంతం జరిగింది. అయితే ఈ వేడుకలో మౌనిక పసుపు రంగు చీర ధరించింది. అలాగే పక్కన ఆమె భర్త మనోజ్ నిల్చుని ఉండగా ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఇటీవలే మౌనిక ప్రెగ్నెన్సీ గురించి కొందరు లేనిపోని వార్తలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు మౌనిక కవలలకు జన్మనివ్వనుందని రకరకాల రూమర్స్ ను క్రియేట్ చేశారు. అయితే, మనోజ్ తన భార్య మౌనిక పై వస్తున్న ప్రచారాల్లో ఎంత వరకు నజం లేదని వాటిని దయచేసి ఎవరు నమ్మవద్దని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు కోరాడు. అలాగే మే నెలలో తమ ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం వెయిటింగ్ అంటూ తన ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చాడు. మరి, ఎంతో సింపుల్ గా జరిగిన భూమ మౌనిక సీంమంత వేడుకల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.