iDreamPost
android-app
ios-app

టాలీవుడ్‌పై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు.. నేను చేసిన పెద్ద మిస్టేక్‌ అదే!

  • Published Jul 08, 2023 | 3:40 PM Updated Updated Jul 08, 2023 | 3:40 PM
  • Published Jul 08, 2023 | 3:40 PMUpdated Jul 08, 2023 | 3:40 PM
టాలీవుడ్‌పై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు.. నేను చేసిన పెద్ద మిస్టేక్‌ అదే!

మోహన్ బాబు కుమార్తెగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మి. హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మాత్రమే కాక.. బుల్లితెర యాంకర్‌గా కూడా రాణించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచు లక్ష్మి మొదట అమెరికాలో సెటిలై, అక్కడ కొన్ని సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత హాలీవుడ్‌ నుంచి ఇక్కడికి వచ్చారు మంచు లక్ష్మి. టాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని భావించినా.. అందుకు తగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. ఇక సినిమా సంగతి పక్కకు పెడితే.. మంచు లక్ష్మికి సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉంది. మరీ ముఖ్యంగా మంచు లక్ష్మి స్పీచ్‌, భాష మీద విపరీతమైన ట్రోల్స్‌ వస్తుంటాయి. కానీ ఆమె వాటిని పెద్దగా పట్టించుకోరు. తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి.

మంచులక్ష్మి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను హాలీవుడ్ నటిని. అక్కడ కొన్ని సినిమాలు చేశాను. ఇంకొన్నాళ్లు అక్కడే ఉంటే ఈ పాటికి స్టార్ అయ్యుండేదాన్ని. కానీ పాప కోసం, ఫ్యామిలీ దగ్గరగా ఉంటుందని ఇండియాకు తిరిగి వచ్చాను. నేను నటిని కదా.. ఎక్కడైతే ఏంటి సినిమాలు చేయడానికి అనుకుని టాలీవుడ్‌లో నటిగా రాణించే ప్రయత్నాలు చేశాను. కానీ అదే నేను చేసిన పెద్ద మిస్టేక్‌. ఇప్పుడు కూడా అవకాశం వస్తే కచ్చితంగా మళ్ళీ హాలీవుడ్‌కి వెళ్ళిపోతాను. ఈసారి వెళ్తే మాత్రం మళ్లీ తిరిగి రాను. ఇక్కడ చాలా కష్టపడ్డాను.. కానీ నేను అనుకున్న ఫలితం రాలేదు. ఇక్కడ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎక్కువ ఇవ్వరు. మధుశాలిని, బిందు మాధవి, నిహారిక, శివాని.. ఇలా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఛాన్సులు లేవు. ఆడియన్స్ కూడా బయటి అమ్మాయిలనే చూస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ ని తీసుకొస్తేనే చూస్తున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అని అంది.

అందుకు మరి మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టి తెలుగు వాళ్లకు ఛాన్సులు ఇవ్వొచ్చు కదా అని అడగ్గా.. అందుకు మంచు లక్ష్మి సమాధానమిస్తూ.. ‘‘నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది, కానీ నేను ఎంతమందికి అవకాశం ఇవ్వగలను, నాకే సరైన ఛాన్సులు లేవు, ఇంక నేనెలా ఇవ్వగలుగుతాను. దీని గురించి మన దర్శక నిర్మాతలు ఆలోచించాలి’’ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎవరో బయటి వారో.. లేక అప్‌ కమింగ్‌ ఆర్టిస్ట్‌ చేసి ఉంటే ఇంత సంచలనం అయి ఉండేవి కావు. కానీ ఏకంగా మోహన్‌ కుమార్తె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. చాలా మంది మంచు లక్ష్మి మాటలకు మద్దతు తెలుపుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet