iDreamPost
android-app
ios-app

మనసంతా నువ్వే చిన్నారి.. అస్సలు గుర్తుపట్టలేని రేంజ్‌లో

  • Published Mar 23, 2024 | 5:35 PM Updated Updated Mar 23, 2024 | 5:35 PM

‘మనసంతా నువ్వే’ ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటి. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అమ్మాయి గర్తుందా.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

‘మనసంతా నువ్వే’ ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటి. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అమ్మాయి గర్తుందా.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

  • Published Mar 23, 2024 | 5:35 PMUpdated Mar 23, 2024 | 5:35 PM
మనసంతా నువ్వే చిన్నారి.. అస్సలు గుర్తుపట్టలేని రేంజ్‌లో

‘ ఎప్పటికి నా మదిలో కొలువున్నది నువ్వైనా.. చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎప్పుడైనా’ అంటే ఇక ఆ అవకాశమే లేదు ఉదయ్ కిరణ్ విషయంలో. ఒకప్పటి డ్రీమ్ బాయ్, అమ్మాయిల క్రష్.. అభిమానుల్ని శోక సంద్రంలో ముంచేసి వెళ్లిపోయాడు. తాజాగా ఆయన నటించిన నువ్వు నేను సినిమా రీ రిలీజైంది. ప్రేక్షకులు మరోసారి ఉదయ్ కిరణ్‌ను తెరమీద చూసుకుని, బరువెక్కిన హృదయాలతో బయటకు వచ్చారు. 2014 జనవరిలో ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్. పదేళ్లు కావస్తున్నా.. ఆ నటుడి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అతడు గుర్తుకు వస్తే సన్నటి నీటి పొర ఇంకా కళ్లను తాకుతూనే ఉంటుంది అతడ్ని ఆరాధించిన అభిమానులకి.

చిత్రం సినిమాతో రంగుల ప్రపంచంలోకి ఎంటరైన ఈ హైదరాబాద్ కుర్రాడు.. మనసంతా నువ్వేతో బాయ్ నెక్స్ట్ డోర్ అనిపించుకున్నాడు. ఈ సినిమాతో ఉదయ్ లాంటి కొడుకు, అన్న, ప్రియుడు ఉండాలని అనుకున్నారు. ఈ సినిమా ఆయనకే కాదూ.. ఫ్యాన్స్‌కు కూడా స్పెషల్ చిత్రం. ఇక ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అన్న సంగతి విదితమే. ఇందులో తూనీగా తూనీగ సాంగ్ అయితే.. ఇప్పటికీ చార్ట్ బస్టర్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ చిత్రంలో చిన్నప్పటి రీమా సేన్ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుంది కదా. ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. అస్సలు గుర్తుపట్టలేరు ఇప్పుడు. ఇంతకు ఆ భామ ఇప్పుడు ఏమైంది.. ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి.

ఆ అమ్మాయి పేరు సుహాని కలిత. జూనియర్ ఎన్టీఆర్ బాల రామయణంతో బాల నటిగా కెరీర్ స్టార్ చేసిన ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ.. అనేక సినిమాల్లో చైల్ట్ ఆర్టిస్టుగా నటించింది. గణేష్, ప్రేమంటే ఇదేరా, నా హృదయంలో నిదురించే చెలి, ప్రేమించే మనసు వంటి చిత్రాల్లో బాల నటిగా మెరిసినా.. ఆమెకు గుర్తింపు నిచ్చిన చిత్రం మనసంతా నువ్వే. అందులో చిన్నారి అనుగా నటించింది. స్పెషల్ సాంగ్ కూడా ఉండటం.. అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చైల్డ్ ఆర్టిస్టుగా మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టాయి. ఇక్కడే కాదూ హిందీ, బెంగాలీ చిత్రాల్లో బాల నటిగా చేసింది ఈ బ్యూటీ. తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చి.. స్నేహ గీతం వంటి అడపా దడపా సినిమాలు చేసిన సక్సెస్ కాలేకపోయింది.

2012 నుండి ఇండస్ట్రీకి దూరం ఉంటున్న ఈ చందమామ.. 2022లో విభోర్ హసిజా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం  ట్రావెలర్ ఇన్ఫ్యుయెన్సర్‌గా మారినట్లు ఉంది. అలాగే ఆమె భర్త విబోర్ కూడా యూత్ ఎంటర్ ప్రెన్యూర్. ఇండియాలో ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నాడు విభోర్. ఇక సుహాని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. భర్తతో దిగిన ఫోటోలు, ట్రావెలింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేస్తోంది. చెప్పాలంటే.. అప్పటి కంటే.. ఇప్పుడు మరింత అందంగా.. చాలా క్యూట్‌గా, నాజుగ్గా కనిపిస్తోంది అమ్మడు. ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేస్తున్నారు. అలా ఏ దర్శకుడు కళ్లల్లోనో పడితే.. మళ్లీ తెరపై కనిపిస్తుందేమో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss