iDreamPost
android-app
ios-app

మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా…?

  • Published Mar 28, 2024 | 4:30 PM Updated Updated Mar 28, 2024 | 4:30 PM

వరుస పెట్టి చైల్డ్ ఆర్టిస్టులు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. గంగోత్రి ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్, తేజ సజ్జా ఇప్పుడు ఇండస్ట్రీలో హవా సాగిస్తున్నారు. ఇప్పుడు మల్లీశ్వరి సినిమాలో నటించిన చిన్నారి కూడా ఆ జాబితాలో చేరింది. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే..?

వరుస పెట్టి చైల్డ్ ఆర్టిస్టులు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. గంగోత్రి ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్, తేజ సజ్జా ఇప్పుడు ఇండస్ట్రీలో హవా సాగిస్తున్నారు. ఇప్పుడు మల్లీశ్వరి సినిమాలో నటించిన చిన్నారి కూడా ఆ జాబితాలో చేరింది. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే..?

  • Published Mar 28, 2024 | 4:30 PMUpdated Mar 28, 2024 | 4:30 PM
మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా…?

ఇటీవల చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటుతున్నారు. గంగోత్రిలో చిన్నప్పటి అల్లుఅర్జున్, అదితి అగర్వాల్ పాత్రలో మెప్పించిన చిన్నారులు తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఈ ఇద్దరు టాలీవుడ్ పరిశ్రమలో తమ హవా చాటుతున్నారు. మసూదతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కావ్య, బలగం చిత్రంతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఇక తేజ గురించి చెప్పనక్కర్లేదు. ఇతగాడు ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్. హనుమాన్ మూవీ అతడ్ని ఓవర్ నైట్ స్టార్ హీరో స్థాయికి తీసుకెళ్లింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే అతడు కుర్రాడు దీపక్ సరోజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక దేవి సినిమాలో పిల్లగాడు.. కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాడు.

మరీ ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డది గుర్తుందా..? మల్లీశ్వరి సినిమాలో వెంకటేశ్ అన్నయ్య కూతురిగా నటించి అలరించింది. ఇందులో వెంకటేశ్ ఆమె కాంబోలో మంచి సన్నివేశాలున్నాయి.  పెళ్లి కాని ప్రసాదు పాత్రలో వెంకటేశ్ నటన ఆసమ్. ఈ చిత్రంలో చాక్లెట్ తీసుకు రాగానే.. బార్ అంటే ఇంత బారుగా ఉండాలి అంటూ మన హీరోకు ఝలక్ ఇస్తుంది పాప. ఆ చిన్నారి పేరు గ్రీష్మ నేత్రిక. చైల్డ్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది. అమ్ములు, మల్లీశ్వరి, అశోక్, కొంచెం ఇస్టం కొంచెం కష్టం, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు వంటి చిత్రాల్లో మెరిసింది. ఇప్పుడు  ఈ పాప యుక్త వయస్సుకు వచ్చింది. ఇప్పుడు కూడా పలు సినిమాల్లో నటించింది. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్.. మహా నాయకుడు చిత్రంలో నందమూరి తారక రామారావు సతీమణి బసవతారకం యంగ్ పాత్రలో కనిపించి అలరించింది గ్రీష్మ నేత్రికనే.

హైదరాబాద్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ భామ.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీగా మారుతుంది. ప్రస్తుతం ఆమె కంటెంట్ క్రియేటర్ గా పర్క్ చేస్తుంది. స్టార్ అప్ హైదరాబాద్ అనే వెబ్ సైట్‌లో కంటెంట్ రాస్తోంది. అంతేకాదూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసినట్లే. అందులోనూ తెలుగు అమ్మాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మర్మ దేశం అనే చిత్రం ఉంది.  ఆమె ఫోటోలు చూసిన వారు వావ్ ఆపాప ఈ పాపనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ బాల నటి కూడా త్వరలోనే పెద్ద హీరోయిన్ స్టాయికి వెళ్లే అవకాశాలున్నాయి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio