iDreamPost
android-app
ios-app

ప్రముఖ దర్శకుడికి గుండెపోటు.. పరిస్థితి విషమం!

  • Author singhj Published - 09:52 PM, Mon - 7 August 23
  • Author singhj Published - 09:52 PM, Mon - 7 August 23
ప్రముఖ దర్శకుడికి గుండెపోటు.. పరిస్థితి విషమం!

గుండెపోటు.. ఈ పదం వింటే చాలు అందరూ హడలిపోతున్నారు. ఒకప్పుడు 60ల్లో వచ్చే హార్ట్ ఎటాక్ ఇప్పుడు చిన్నవయసు వారినీ కబలిస్తోంది. గుండెనొప్పి బారిన పడే టీనేజీ పిల్లల సంఖ్య పెరిగిపోతోంది. హార్ట్ ఎటాక్ లక్షణాలను మొదట్లోనే గుర్తించకపోవడంతో చాలా మంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు, సమయపాలన లేకపోవడం, కలుషిత ఆహారం, పని ఒత్తిడి, శారీరక శ్రమ చేయకపోవడం, మానసిక ఆందోళనలు, ఇతర అనారోగ్య సమస్యలు గుండెపోటుకు ప్రధానంగా కారణం అవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కూడా హార్ట్ ఎటాక్ భయపెడుతోంది. ఎంతో హెల్తీగా, ఫిట్​గా ఉండే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్​కుమార్​ గుండెపోటుతోనే చనిపోయారు. ఆ తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు హార్ట్ ఎటాక్ వల్ల మరణించారు. సామాన్యుల విషయమైతే చెప్పనక్కర్లేదు. స్కూలులో పాఠాలు చెబుతూ గుండెనొప్పితో కుప్పకూలిన టీచర్, జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. ఇలా హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు పోయిన ఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం.

తాజాగా మరో ఫిల్మ్ సెలబ్రిటీ హార్ట్ ఎటాక్ బారిన పడ్డారు. ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే కొచ్చిలోని ఒక ఆస్పత్రికి తరలించి.. ఐసీయూలో ఉంచి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం సిద్దిఖీ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మాలీవడ్​లో స్టార్ డైరెక్టర్​గా ఆయనకు పేరుంది. మోహన్​లాల్​తో ‘గాడ్​ఫాదర్’ సినిమా తీసి బ్లాక్​బస్టర్ కొట్టారు సిద్దిఖీ. ఇదే చిత్రం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘గాడ్​ఫాదర్’గా రీమేక్ అయింది. ఈ సినిమా తర్వాత ‘హిట్లర్’, ‘బిగ్​బ్రదర్’, ‘ఫ్రెండ్స్’, ‘కాబూలీవాలా’ మూవీస్ తీశారు సిద్దిఖీ. హిందీలో సల్మాన్ ఖాన్​తో ‘బాడీగార్డ్’ సినిమాను తెరకెక్కించారాయన.