iDreamPost
android-app
ios-app

కారులో నటుడి అనుమానాస్పద మృతి!

ఆదివారం ఉదయం ప్రముఖ దర్శకుడు సంజయ్‌ గాధ్వీ కన్నుమూశారు. ఈ విషాదం మరువక ముందే మరో విషాదం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నటుడు కారులో శవమై తేలారు...

ఆదివారం ఉదయం ప్రముఖ దర్శకుడు సంజయ్‌ గాధ్వీ కన్నుమూశారు. ఈ విషాదం మరువక ముందే మరో విషాదం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నటుడు కారులో శవమై తేలారు...

కారులో నటుడి అనుమానాస్పద మృతి!

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ రోజు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు ‘ సంజయ్‌ గాధ్వీ’ కన్నుమూశారు. ఉదయం మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా ఆయన గుండె దగ్గర నొప్పి మొదలైంది. దీంతో ఆయన్ని కోకిలాబెన్‌ అంబానీ ఆస్పత్రికి తరలించారు. సంజయ్‌ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన చనిపోయినట్లు ధ్రువీకరించారు. సంజయ్‌ మృతికి గుండెపోటే కారణమని తేల్చారు. ఈ విషాద సంఘటన మరువక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ మలయాళ నటుడు ఒకరు చనిపోయారు. కారులో అనుమానాస్పద రీతిలో శవమై తేలారు. వినోద్‌ థామస్‌కు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మలయాళంలో చాలా పేరుంది. ఆయన ఎన్నో పాపులర్‌ చిత్రాల్లో నటించారు. సినిమాతో పాటు ఆయన పలు టీవీ షోలు, షార్ట్‌ ఫిల్స్మ్‌లు కూడా చేశారు. నిన్న ఉదయం 11 గంటల టైంలో థామస్‌ కొట్టాయంలోని పాంపడిలో ఉన్న హోటల్‌కు వెళ్లారు. నిన్న రాత్రి 8.30 గంటల సమయంలో.. హోటల్‌ దగ్గరలో కారులో ఆయన స్ప్రహ లేకుండా పడి ఉండటాన్ని గుర్తించారు.

హోటల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కారు అద్దాలు పగులగొట్టారు. డోరు ఓపెన్‌ చేసి వినోద్‌ను బయటకు తీశారు. వెంటనే వైద్య చికిత్సల కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వినోద్‌ను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన చనిపోయినట్లు గుర్తించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

టాక్సిక్‌ గ్యాస్‌ కారణంగానే వినోద్‌ మరణం సంభవించి ఉండొచ్చని దర్యాప్తు చేస్తున్న టీం భావిస్తోంది. కారు ఎయిర్‌ కండీషన్‌లోంచి టాక్సిక్‌ గ్యాసు బయటకు వచ్చి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయని అంటోంది. కాగా, వినోద్‌ వయసు ప్రస్తుతం 45 సంవత్సరాలు మాత్రమే ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. కేవలం నటుడిగానే కాదు.. సింగర్‌గా కూడా ఆయన తన సత్తా చాటారు. తాజాగా, ‘ భగవాన్‌ దేశంటే రామరాజ్యం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.

ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. వినోద్‌ ఆకస్మిక మరణంతో చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు వినోద్‌ మరణంపై తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక,  ఈ నెల 11న ప్రముఖ టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన చనిపోయారు. మరి, ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.