iDreamPost
android-app
ios-app

Ram Charan: డిసెంబర్ టార్గెట్ గా గేమ్ ఛేంజర్! శంకర్ ప్లాన్ ఏంటి?

  • Published Jul 19, 2024 | 12:14 PM Updated Updated Jul 19, 2024 | 12:14 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ మూవీ డిసెంబర్ ను టార్గెట్ గా చేసుకుని బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ మూవీ డిసెంబర్ ను టార్గెట్ గా చేసుకుని బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 19, 2024 | 12:14 PMUpdated Jul 19, 2024 | 12:14 PM
Ram Charan: డిసెంబర్ టార్గెట్ గా గేమ్ ఛేంజర్! శంకర్ ప్లాన్ ఏంటి?

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్-గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా, అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు శంకర్. భారతీయుడు 2 పై ఫోకస్ పెట్టడంతో.. చరణ్ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఇండియన్ 2 రిలీజ్ కావడంతో.. గేమ్ ఛేంజర్ షూట్ ను స్పీడ్ గా పూర్తి చేయాలని భావిస్తున్నారు మేకర్స్. వీలైనంత త్వరగా షూట్ ను కంప్లీట్ చేసి.. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే శంకర్ ఇంత స్పీడ్ గా రావాలనుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయుడు 2.. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ మార్క్ మిస్ కావడంతో.. మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే ఈ మూవీ ఫలితం నుంచి బయటపడి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గేమ్ ఛేంజర్ ను థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్స్ వేస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మిగిలిన షూటింగ్ ను స్పీడ్ గా పూర్తి చేసి.. డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు 2 ఇచ్చిన ఫలితానికి గేమ్ ఛేంజర్ తో హిట్ కొట్టి.. తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని శంకర్ ఆరాటపడుతున్నాడు. అందుకే త్వరగా షూటింగ్ ను కంప్లీట్ చేసి.. రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. డిసెంబర్ ను టార్గెట్ గా చేసుకుని బరిలోకి దిగుతున్నాడు.

అయితే అదే నెల 6న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ ల పుష్ప 2 రాబోతోంది. కానీ.. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడటంతో.. ఆ నెలను టార్గెట్ చేసుకుని బరిలోకి దిగాలన్నది శంకర్ అండ్ కో ప్లాన్. పుష్ప 2 మూవీతో పాటుగా అదే రోజున కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన ‘మెయ్యజగన్’ అనే మూవీ కూడా రిలీజ్ అవుతుంది. దాంతో అదీకాక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కూడా డిసెంబర్ లోనే వస్తున్నట్లు తాజాగా విష్ణు ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. దాంతో డిసెంబర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రసవత్తరపోరు ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet