iDreamPost
android-app
ios-app

Pushpa 2 Latest Update: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! పుష్ప 2 షూటింగ్ అప్పటి నుంచే..

  • Published Jul 19, 2024 | 9:54 AM Updated Updated Jul 19, 2024 | 9:54 AM

పుష్ప 2 మూవీ షూటింగ్ పై గత కొన్ని రోజులుగా గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. దాంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే తాజాగా బన్నీ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవ్వబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 మూవీ షూటింగ్ పై గత కొన్ని రోజులుగా గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. దాంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే తాజాగా బన్నీ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవ్వబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 19, 2024 | 9:54 AMUpdated Jul 19, 2024 | 9:54 AM
Pushpa 2 Latest Update: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! పుష్ప 2 షూటింగ్ అప్పటి నుంచే..

పుష్ప 2.. ప్రస్తుతం ఇండియా వైడ్ గా ట్రెండింగ్ అవుతున్న సినిమా. దానికి కారణం మనందరికి తెలియనిది కాదు. షూటింగ్ ఆలస్యం అవుతుండటం కారణంగా అల్లు అర్జున్ అసంతృప్తిలో ఉన్నాడని, అందుకే విదేశాలకు వెకేషన్ కు వెళ్లాడని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు డైరెక్టర్ సుకుమార్ సైతం వెకేషన్ లోనే ఉన్నాడు. దాంతో ఈ సినిమా షూటింగ్ పై గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలోనే పుష్ప 2 షూట్ ప్రారంభం కాబోతుందట. ఆ వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కాంబోలో ‘పుష్ప: ది రూల్’ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం.. ఆగస్ట్ 15న విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల షూటింగ్ పూర్తికాకపోవడంతో.. డిసెంబర్ 6కు వాయిదా పడింది. అయితే ఇంకా 30 రోజుల షూటింగ్ మిగిలి ఉందని, ఎడిటింగ్ వర్క్, ప్రమోషన్లకు టైమ్ సరిపోదని బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అదీకాక ఇటీవలే అనుకోకుండా షూట్ కు బ్రేక్ ఇచ్చి హీరో, డైరెక్టర్ విదేశాలకు వెళ్లారు. బన్నీ ఇండియా తిరిగిరాగా.. సుకుమార్ రేపో, మాపో రానున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పుష్ప 2 షూటింగ్ పై ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22 లేదా 25న షూటింగ్ స్టార్ట్ అవుతుందని, 28వ తారీఖు నుంచి బన్నీ షూటింగ్ లో పాల్గొంటాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుని అనుకున్న టైమ్ డిసెంబర్ 6న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ సంతోషపడుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss