iDreamPost
iDreamPost
రేపు విడుదల కాబోతున్న మేజర్ మీద హైప్ అంతకంతా పెరుగుతోంది. కమల్ హాసన్ విక్రమ్ పోటీని తట్టుకుని ఈ స్థాయి బజ్ రావడమంటే విశేషమే. అందులోనూ రిలీజ్ కు ముందు రోజు రాత్రి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రీమియర్లు వేయడంతో టీమ్ కు దీని మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతుంది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ముంబైపై టెర్రరిస్టుల దాడులను కథాంశంగా తీసుకుని దర్శకుడు శశికిరణ్ తిక్కా దీన్ని రూపొందించారు. మహేష్ బాబు నిర్మాణ భాగస్వామి కావడంతో ప్రమోషన్ విషయంలో ప్రతిదీ శ్రద్ధగా చూసుకోవడంతో విక్రమ్, సామ్రాట్ పృథ్విరాజ్ లను ఓవర్ టేక్ చేసి మరీ మేజర్ అడ్వాన్స్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్నాడు
ఇక బిజినెస్ విషయానికి వస్తే మేజర్ తెలుగు వెర్షన్ సుమారుగా 13 కోట్ల థియేటిరికల్ వేల్యూ చేసింది. లాభాలు రావాలంటే పధ్నాలుగు కోట్ల దాకా రావాల్సి ఉంటుంది. హిట్ టాక్ వస్తే ఇది కష్టం కాదు. పైగా సర్కారు వారి పాట స్లో అయ్యింది. ఎఫ్3 వీక్ డేస్ లో నెమ్మదించినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని వాడుకుంటే మేజర్ కు చాలా ప్లస్ అవుతుంది. పైగా విక్రమ్, పృథ్విరాజ్ లతో పోలిస్తే రిలీజ్ పరంగా మంచి స్క్రీన్లు దక్కాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలని డిసైడ్ అయితే బ్లాక్ బస్టర్ ఖాయం. గూఢచారి సైతం ఇలాగే స్లోగా మొదలై తర్వాత సూపర్ హిట్ స్టేటస్ ని దాటేసింది. ఇక ఏరియాల వారిగా బిజినెస్ ఎలా ఉందో చూద్దాం
నైజామ్ – 3 కోట్ల 50 లక్షలు
సీడెడ్ – 2 కోట్లు
ఆంధ్రా- 4 కోట్ల 50 లక్షలు
తెలుగు రాష్ట్రాల బిజినెస్ – 10 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి
ఓవర్సీస్ – 2 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మేజర్ తెలుగు బిజినెస్ – 13 కోట్లు
ఇది ఎలా చూసుకున్నా రీజనబుల్ గా ఇచ్చేసిన రేట్లు. ఇప్పటికే ఈ ముంబై దాడుల మీద పలు సినిమాలు వచ్చిన నేపథ్యంలో మేజర్ ఏ విధంగా ప్రత్యేకంగా నిలుస్తాడనేది వేచి చూడాలి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లతో సౌత్ సినిమా డామినేషన్ బాలీవుడ్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మేజర్ విషయంలోనూ అక్షయ్ కుమార్ ని కాదని అడవి శేష్ సినిమా మీదే అక్కడి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కంటెంట్ కి పెరుగుతున్న ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో. వచ్చే వారం నాని అంటే సుందరానికి, కన్నడ డబ్బింగులు ఛార్లీ 777లు వస్తున్నాయి కాబట్టి మేజర్ కు ఫస్ట్ వీక్ చాలా కీలకం కాబోతోంది.