iDreamPost
android-app
ios-app

లుంగీ కట్టి.. మాస్ లుక్ లో అదరగొట్టిన మహేష్ బాబు! కొత్త పోస్టర్ వైరల్!

  • Author ajaykrishna Updated - 08:36 AM, Wed - 9 August 23
  • Author ajaykrishna Updated - 08:36 AM, Wed - 9 August 23
లుంగీ కట్టి.. మాస్ లుక్ లో అదరగొట్టిన మహేష్ బాబు! కొత్త పోస్టర్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కావాల్సిన ట్రీట్ వచ్చేసింది. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ‘గుంటూరు కారం’. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా.. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా అనౌన్స్ మెంట్ అయినప్పటి నుండి ఫ్యాన్స్ అందరు సూపర్ ఎక్సయిట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే.. వీరి కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అలాంటిది.

మహేష్ తో ఇదివరకే త్రివిక్రమ్.. అతడు, ఖలేజా సినిమాలు తీసి మెప్పించాడు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం చవిచూసినా.. ప్రేక్షకులకు మాత్రం ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీస్ కి ఇవి తప్పకుండా ఉంటాయి. ఇక గుంటూరు కారం సినిమా.. దాదాపు 12 ఏళ్ళ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ ని సెట్ చేసింది. దీంతో ఈసారి పక్కాగా బ్లాక్ బస్టర్ అని ముందే అంచనా వేసేస్తున్నారు అభిమానులు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇప్పటివరకు గుంటూరు కారం నుండి రిలీజ్ చేసిన మహేష్ మాస్ లుక్ గానీ, బీడీ త్రీడిలో కనిపిస్తుందా అనే గ్లింప్స్ గానీ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. ఈ క్రమంలో మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఆగష్టు 9న మహేష్ బర్త్ డే కావడంతో.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొత్త పోస్టర్ వదిలి.. ఫ్యాన్స్ లో ఊపు తెప్పించారు. ఫ్యాన్స్ అంచనాలకు రీచ్ అయ్యిందో లేదో గానీ.. పోస్టర్ లో మహేష్ బాబు మళ్లీ బీడీ వెలిగిస్తూ కనిపించాడు. కాకపోతే ఈసారి లుంగీలో.. ఇదివరకు ప్యాంటు షర్ట్ లో నడుచుకుంటూ బీడీ వెలిగించిన పోస్టర్ మొదట్లో వదిలారు. ఇప్పుడు లుంగీలో కూర్చున్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఇంకా వీడియో బిట్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండవచ్చు. కానీ.. ప్రస్తుతం పోస్టర్ తో సరిపెట్టారు మేకర్స్. కాగా.. తాజా పోస్టర్ సైతం సినిమాపై సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి గుంటూరు కారం కొత్త పోస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet