iDreamPost
android-app
ios-app

SSMB29లో మహేష్ ఒక్కడే కాదట.. గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్!

  • Published Feb 26, 2024 | 9:58 PM Updated Updated Feb 26, 2024 | 9:58 PM

SSMB29కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే నిజమైతే.. బాక్సాఫీస్ బద్దలవ్వడమే కాదు.. రికార్డులు తగలబడిపోతాయి అంటున్నారు నెటిజన్లు. మరి గూస్ బంప్స్ తెప్పించే ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

SSMB29కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే నిజమైతే.. బాక్సాఫీస్ బద్దలవ్వడమే కాదు.. రికార్డులు తగలబడిపోతాయి అంటున్నారు నెటిజన్లు. మరి గూస్ బంప్స్ తెప్పించే ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • Published Feb 26, 2024 | 9:58 PMUpdated Feb 26, 2024 | 9:58 PM
SSMB29లో మహేష్ ఒక్కడే కాదట.. గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్!

SSMB29.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులతో పాటుగా సగటు సినీ అభిమానులు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న వరల్డ్ వైడ్ అడ్వెంచరల్ మూవీ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే దిమ్మతిరిగిపోతోంది. తాజాగా SSMB29కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సూపర్ స్టార్ మహేష్-ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ కోసం టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ రేంట్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథ పూర్తైందని తెలుస్తోంది. ఈ ఏడాది మేలో మూవీని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సహజంగానే తన సినిమాకు ఫస్ట్ నుంచి భారీ హైప్ ను క్రియేట్ చేస్తూ వస్తుంటాడు జక్కన్న. ఇక ఈ మూవీ కోసం కూడా భారీ ప్లాన్ నే వేశాడట. అదేంటంటే? ఈ సినిమాలో మహేష్ తో పాటుగా మరో ఇద్దరు, ముగ్గురు స్టార్ హీరోలు క్యామియో రోల్స్ లో మెరవబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ వైరల్ కావడంతో.. ఆ హీరోలు ఎవరు? అంటూ తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.

అయితే రాజమౌళితో తారక్, రామ్ చరణ్ లు బాగా క్లోజ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరేనా? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. ఇదే నిజమైతే.. బాక్సాఫీస్ బద్దలవ్వడమే కాదు.. రికార్డులు తగలబడిపోతాయి అంటున్నారు నెటిజన్లు. అమెజాన్ అడవుల్లో సాగే ఈ చిత్రం గురించి ఇప్పటికే వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ న్యూస్ వైరల్ కావడంతో.. ఈ అంచనాలు హాలీవుడ్ కోటలను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెతో పాటుగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కూడా నటిస్తోందని సమాచారం. మరి జక్కన్న మాస్టర్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: అరుదైన వ్యాధితో ‘కెప్టెన్ మార్వెల్’ నటుడు మృతి!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet