iDreamPost
android-app
ios-app

అరుదైన వ్యాధితో ‘కెప్టెన్ మార్వెల్’ నటుడు మృతి!

  • Published Feb 26, 2024 | 8:20 PM Updated Updated Feb 26, 2024 | 8:20 PM

అరుదైన వ్యాధితో ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూశాడు. కెప్టెన్ మార్వెల్ చిత్రంతో ఇతడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

అరుదైన వ్యాధితో ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూశాడు. కెప్టెన్ మార్వెల్ చిత్రంతో ఇతడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

  • Published Feb 26, 2024 | 8:20 PMUpdated Feb 26, 2024 | 8:20 PM
అరుదైన వ్యాధితో ‘కెప్టెన్ మార్వెల్’ నటుడు మృతి!

హాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు కెన్నెత్ మిచెల్(49) ఫిబ్రవరి 24 శనివారం నాడు తుదిశ్వాస విడిచాడు. కెప్టెన్ మార్వెల్, స్టార్ ట్రెక్ సిరీస్ తో పాటుగా మరెన్నో అద్భుత చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కెన్నెత్. అయితే గత ఐదేళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న అతడు తాజాగా ఆ మహమ్మారికి బలైయ్యాడు.

కెన్నెత్ మిచెల్.. 49 ఏళ్ల ఈ హాలీవుడ్ నటుడు కెప్టెన్ మార్వెల్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ అద్భుతమైన నటుడిని ఓ అంతుచిక్కని మహమ్మారి వ్యాధి బలితీసుకుంది. మిచెల్ గత 5 సంవత్సరాలుగా ALS(అమియోట్రోఫిక్ లాటెరల్ స్క్లెరోసిస్) అనే అరుదైన వ్యాధితో పోరాడుతూ వస్తున్నాడు. తాజాగా ఆతడి పోరాటం ముగిసింది. ఫిబ్రవరి 24 శనివారం నాడు కెన్నెత్ మిచెల్ తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు ఆలస్యంగా వెల్లడించారు.

Captain Marvel actor died!

కాగా.. 2000 నుంచి ఇండస్ట్రీలో ఉన్న కెన్నెత్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్నాడు. మిరాకిల్, ఛార్మ్స్ ఫర్ ది ఈజీ లైఫ్, బ్లడ్ హనీ, ఘోస్ట్ విస్పరస్, కెప్టెన్ మార్వెల్, స్టార్ టెక్ సిరీస్ లాంటి చిత్రాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. 2006లో నటి సుసాన్ మే ప్రాట్ ని పెళ్లి చేసుకున్నాడు కెన్నెత్. వీరికి ఇద్దరు సంతానం. అతడి మరణవార్త తెలుసుకున్న ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

ఇదికూడా చదవండి: OTTలోకి సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom