iDreamPost
android-app
ios-app

మహేష్ బాబు మానవత్వం..మరో చిన్నారికి గుండె ఆపరేషన్!

  • Published Sep 06, 2023 | 1:08 PM Updated Updated Sep 06, 2023 | 1:08 PM
  • Published Sep 06, 2023 | 1:08 PMUpdated Sep 06, 2023 | 1:08 PM
మహేష్ బాబు మానవత్వం..మరో చిన్నారికి గుండె ఆపరేషన్!

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు బాలనటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా మారారు. మాస్, క్లాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ తనదై ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఓ వైపు వెండితెరపై అలరిస్తూనే.. బుల్లితెరపై పలు యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మహేష్ బాబు గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారుల పాలిట ఆపద్భాందవుడయ్యాడు. తాజాగా మరోసారి చిన్నారి ప్రాణలు నిలిపి మహేష్ బాబు మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..

గుండె ఆపరేషన్ అంటే సామాన్య విషయం కాదు. ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అని అందరికీ తెలిసిందే. అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతోంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనంతపూర్ జిల్లాకి చెందిన నాలుగు నెలల శాన్విక గుండెకి రంధ్రం ఉండటంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. పాపకు సర్జరీ చేయించడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తల్లిదండ్రులు బాధపడుతున్న సమయంలో మహేష్ బాబు ఫౌండేషన్ గురించి డాక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. వెంటనే వారిని సంప్రదించగా పాప గుండె ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే పాపకు గుండె ఆపరేషన్  విజయవంతంగా  పూర్తి చేశారు.

ఈ సందర్భంగా చిన్నారి తండ్రి సంజీవ రాయుడు మాట్లాడుతూ.. ‘మా పాప శాన్విక రాయుడు.. రెండు నెలలు ఉన్నపుడు ఆనారోగ్యానికి గురైంది. హాస్పిటల్ కి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి పాపకు గుండెలో హోల్ ఉందని చెప్పారు. అక్కడ నుంచి ఆంధ్ర హాస్పిటల్ కి రిఫర్ చేశారు. అప్పటి నుంచి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం.. పాపకు సర్జరీ చేయాలని ఖచ్చితంగా చెప్పారు. కానీ అంత డబ్బు మా వద్ద లేకపోవడంతో ఆందోళన చెందాం. ఆ సమయంలోనే మహేష్ బాబు ఫౌండేషన్ ని సంప్రదించాం.. వారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. పాపకు ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశారు. మా పాప ప్రాణాలు నిలిపిన మహేష్ బాబు ధన్యవాదాలు’ అని అన్నారు. ఇప్పటికే మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా రెండు వేల మందికి పైగా చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేన్లు చేయించి ప్రాణాలను నిలబెట్టారు. మరోసారి చిన్నారి ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet