iDreamPost
android-app
ios-app

Prabhas: ప్రభాస్ పాన్ ఇండియా హిట్స్ వెనుక.. మహేశ్ పోకిరి టచ్! ఫ్యాన్స్ ఇది గమనించారా?

  • Published Jul 09, 2024 | 8:18 PM Updated Updated Jul 09, 2024 | 8:18 PM

యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా చిత్రాల వెనుక సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరి మూవీ టచ్ ఉందని మీలో ఎంత మంది గమనించారు? అసలు ఆ టచ్ ఏంటి? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా చిత్రాల వెనుక సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరి మూవీ టచ్ ఉందని మీలో ఎంత మంది గమనించారు? అసలు ఆ టచ్ ఏంటి? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Prabhas: ప్రభాస్ పాన్ ఇండియా హిట్స్ వెనుక.. మహేశ్ పోకిరి టచ్! ఫ్యాన్స్ ఇది గమనించారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా హీరోగా రాకెట్ వేగంలో దూసుకెళ్తున్నాడు. డార్లింగ్ సినిమా థియేటర్లలోకి వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ రికార్డులకు ఒక పక్క వణుకుపుట్టాల్సిందే. బాహుబలి నుంచి మెుదలుకొని, నిన్నటి కల్కి వరకు ఏ చిత్రం చూసినా రెబలోడి స్టామినా కనిపిస్తుంది. ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేందుకు ఎంతో దూరంలో లేదు. అయితే యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా చిత్రాల వెనుక సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరి మూవీ టచ్ ఉందని మీలో ఎంత మంది గమనించారు? అసలు ఆ టచ్ ఏంటి? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కల్కి 2898 ఏడీ మూవీతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే పనిలో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే పలు ఓవర్సీస్ తో పాటుగా మరికొన్ని ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొడుతూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ బాద్ షాగా నిలబడ్డాడు. బాహుబలి నుంచి కల్కి వరకు వసూళ్లలో సత్తా చాటుతూనే ఉన్నాడు. అయితే బాహుబలి నుంచి నిన్నటి కల్కి వరకు దాదాపు ప్రభాస్ ప్రతీ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పోకిరి మూవీ టచ్ కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఎవరైనా గమనించారా? పోకిరి టచ్ మాత్రమే కనిపిస్తోంది.. దాన్ని మాత్రం ఫాలో అవ్వట్లేదు.

పోకిరి.. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసిన చిత్రం. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్-సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాదు.. టాలీవుడ్ అప్పటి వరకు చూడని ట్విస్ట్ ను పరిచయం చేసింది పోకిరి. మహేశ్ ను కృష్ణమనోహర్ ఐపీఎస్ గా పరిచయం చేసే సీన్ సినిమా మెుత్తానికే హైలెట్. ఇలాంటి ట్విస్ట్ అప్పటి వరకు టాలీవుడ్ లోనే రాలేదు. దాంతో ఇది ఇండస్ట్రీకే బెంచ్ మార్క్ గా నిలిచింది. ఈ మూవీ చూసే చాలా మంది ఇలాంటి ట్విస్ట్ లు కథలో ఉండేలా ప్రత్యేకంగా చొరవతీసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. కాకతాళీయమో లేదా యాదృచ్చికమో తెలీదు కానీ ప్రభాస్ పాన్ ఇండియా హిట్ మూవీల్లో పోకిరి టచ్ కనిపిస్తుంది. బాహుబలిని ఎవరు చంపారు? అన్న ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఏ రేంజ్ క్యురియాసిటినీ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఇక సాహో మూవీ విషయానికి వస్తే.. కథ మెుత్తం వేరే వాడిని ముందు పెట్టి నడిపించి.. ఒక దొంగగా వచ్చి.. చివర్లో డాన్ కొడుకే ప్రభాస్ అని చూపించే ట్విస్ట్ కు ప్రేక్షకులకు మైండ్ దొబ్బుతుంది. ‘కొన్ని కొన్ని సార్లు రాజ్యాన్ని కాపాడటానికి రాజే సేనాధిపతిలా వస్తాడు’ అంటూ తన క్యారెక్టర్ కు జస్టిఫై ఇచ్చాడు. శౌర్యంగ పర్వంలో శౌర్యంగా ప్రభాసేనా? అన్న ప్రశ్న కూడా ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక లేటెస్ట్ మూవీ కల్కిలో సైతం ‘ఆలస్యం అయ్యిందా ఆచార్య పుత్ర’ అనే డైలాగ్ తో ఇచ్చిన ట్విస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఒక్క డైలాగే మూవీని నిలబెట్టింది. ఇలాంటి పోకిరి ట్విస్ట్ లు అన్నీ ప్రభాస్ మూవీలో కంటిన్యూ అవ్వడం విశేషం. మరి ప్రభాస్ మూవీస్ లో పోకిరి టచ్ ను ఎంత మంది గమనించారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.