iDreamPost
android-app
ios-app

డార్లింగ్ మూవీ ట్రైలర్ : అపరిచితుడు కజిన్ సిస్టర్ గా నభా నటేష్!

  • Published Jul 09, 2024 | 5:46 PM Updated Updated Jul 09, 2024 | 5:46 PM

Darling Movie(2024) Trailer: అపరిచితుడు మూవీలో విక్రమ్ కు ఉన్న డిజార్డర్ ఉన్న యువతిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ యువకుడు పడే పాట్లు ఏంటి? అన్న క్రేజీ కాన్సెప్ట్ తో 'డార్లింగ్' మూవీతో ప్రియదర్శి-నభా నటేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదల అయిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Darling Movie(2024) Trailer: అపరిచితుడు మూవీలో విక్రమ్ కు ఉన్న డిజార్డర్ ఉన్న యువతిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ యువకుడు పడే పాట్లు ఏంటి? అన్న క్రేజీ కాన్సెప్ట్ తో 'డార్లింగ్' మూవీతో ప్రియదర్శి-నభా నటేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదల అయిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

  • Published Jul 09, 2024 | 5:46 PMUpdated Jul 09, 2024 | 5:46 PM
డార్లింగ్ మూవీ ట్రైలర్ : అపరిచితుడు కజిన్ సిస్టర్ గా నభా నటేష్!

ఇండస్ట్రీకి కొత్త కొత్త దర్శకులు, కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వస్తున్నారు. ప్రయోగాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు గతంలో వచ్చిన ఎన్నో సరికొత్త కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఉదాహరణలుగా నిలవడం మనం చూసే ఉన్నాం. తాజాగా ఓ మూవీ ట్రైలర్ ఇండస్ట్రీ మెుత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఆ మూవీ పేరు ‘డార్లింగ్’. టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రల్లో ఈ మూవీ తెరకెక్కింది. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. లేడీ అపరిచితుడిగా నభా నటేష్ నభూతో నభవిష్యతిగా నటించింది.

ప్రియదర్శి-నభా నటేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా జూలై 19న విడుదల కాబోతోంది. దాంతో మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. పెళ్లి చేసుకుని తన పెళ్లాన్ని పారిస్ కు హనీమూన్ కు తీసుకెళ్లాలని గోల్ పెట్టుకున్న ఓ యువకుడు(ప్రియదర్శి), ఒక యువతిని(నభా నటేష్) పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమెకు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ (అపరిచితుడు సినిమాలో విక్ర‌మ్ లాగా) ఉంటుంది. దాంతో పెళ్లి తర్వాత అతడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఆ డిజార్డర్ చివరికి నయం అయ్యిందా? ఈ సమస్యల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అన్నదే సినిమా కథ. అపరిచితుడు కజిన్ సిస్టర్ లాగా నభా అద్భుతంగా నటించింది. తనదైన యాక్టింగ్ తో దుమ్మురేపింది.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన అందచందాలతో, లుక్స్ తో ఆకట్టుకున్న నభా నటేష్.. ఇప్పుడు తన ఫర్పామెన్స్ తో అలరించడానికి సిద్దమైంది. ట్రైలర్ లోనే ఓ రేంజ్ యాక్టింగ్ చూపించిన ఈ బ్యూటీ.. సినిమా మెుత్తం ఏ రేంజ్ లో అదరగొట్టిందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్ప్లిట్ డిజార్డర్ తో భర్తను కీలు బొమ్మగా మార్చుకుని ఎలాంటి కష్టాలు పెట్టిందో కామెడీగా చూపించాడు డైరెక్టర్. అపరిచితుడు సిస్టర్ పెళ్లాంగా వస్తే.. ఎలా ఉంటుంది? అన్న సరికొత్త కాన్సెప్ట్ డైరెక్టర్ అశ్విన్ రామ్ రాబోతున్నాడు. మరి ఇంతకీ డిజార్డర్ ఉన్న పెళ్లాన్ని పారిస్ తీసుకెళ్లాడా? లేడా? అన్నది తెరపైనే చూడాలి. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ మాత్రం యూట్యూబ్ లో దూసుకెళ్తోంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom