iDreamPost
android-app
ios-app

ట్రెండింగ్ లో మహేష్ బాబు.. కారణం అదొక్కటే కాదట!

  • Author ajaykrishna Published - 09:18 AM, Fri - 29 September 23
  • Author ajaykrishna Published - 09:18 AM, Fri - 29 September 23
ట్రెండింగ్ లో మహేష్ బాబు.. కారణం అదొక్కటే కాదట!

ఇండస్ట్రీలో ఏ పెద్ద సినిమా ట్రెండింగ్ లో ఉన్నా.. దానికి సంబంధించి ఏదొక విషయం సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంటుంది. ఆ విషయాన్ని ఫ్యాన్స్, నెటిజన్స్ వైరల్ చేసేస్తుంటారు. అయితే.. ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ తో పాటు ఎవరో ఒక స్టార్ హీరో పేరు కూడా బయటికి వస్తుంటుంది. అలా దానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో మొదలవుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు సోషల్ మీడియా ట్రెండింగ్ లో కొనసాగుతుంది. అందుకు కారణం.. గుంటూరు కారం, రాజమౌళి ప్రాజెక్ట్ కాదు.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో ఇండస్ట్రీలో మూసధోరణి సినిమాలకు బ్రేక్ వేశాడు సందీప్. కేవలం రెండే రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇటు తెలుగులోనే కాదు.. అటు బాలీవుడ్ లోను సందీప్ క్రేజ్ వేరే లెవెల్ లో క్రియేట్ అయ్యిందని చెప్పవచ్చు. అయితే.. యానిమల్ సినిమాని రణబీర్ కపూర్ హీరోగా రూపొందించాడు సందీప్. డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. యానిమల్ అనే టైటిల్ కి తగ్గట్టుగానే టీజర్ లో సాలిడ్ వైల్డ్ కంటెంట్ ని ప్రెజెంట్ చేశాడు సందీప్. దీంతో యానిమల్ టీజర్ కాస్త ఇండియా వైడ్ ట్రెండింగ్ గా మారింది. అది సరే.. యానిమల్ కి మహేష్ కి లింకేంటి? అని మీకు డౌట్ రావచ్చు.

ఆ విషయంలోకి వెళ్తే.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి.. యానిమల్ స్టోరీని ముందు మహేష్ బాబుకే వినిపించాడట. కానీ.. మహేష్ నో చెప్పడంతో ఆ కథ.. రణబీర్ దగ్గరికి వెళ్ళిందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు టీజర్ చూశాక అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. సందీప్ అసలు ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో రణబీర్ ని ప్రెజెంట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు యానిమల్ ఒక్కటే కాకుండా గతంలో పుష్ప స్టోరీని కూడా మహేష్ వదులుకున్నాడని టాక్ ఉంది. కట్ చేస్తే.. ఆ సినిమాకు బన్నీ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. అలా రెండు బిగ్గెస్ట్ మూవీస్ ని మహేష్ వదులుకోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కనీసం ట్రై చేయాల్సింది అని నెట్టింట మహేష్ పేరు ట్రెండ్ చేస్తున్నారు. మరి మహేష్ ఈ రెండు సినిమాలు చేసుంటే ఎలా ఉండేదో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet