iDreamPost
android-app
ios-app

Mahesh Babu: హైదరాబాద్‌ తిరిగి వచ్చిన మహేష్ బాబు

  • Published Feb 04, 2024 | 6:19 PMUpdated Feb 04, 2024 | 6:19 PM

గుంటూరు కారం మూవీతో అలరించిన మహేష్ బాబు.. తన తదుపరి చిత్రం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. రాజమౌళితో సినిమా ఫిక్స్ అయ్యింది. భారీ బడ్జెట్ మూవీగా తెరకక్కబోతున్న ఈ చిత్ర షూటింగ్...

గుంటూరు కారం మూవీతో అలరించిన మహేష్ బాబు.. తన తదుపరి చిత్రం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. రాజమౌళితో సినిమా ఫిక్స్ అయ్యింది. భారీ బడ్జెట్ మూవీగా తెరకక్కబోతున్న ఈ చిత్ర షూటింగ్...

  • Published Feb 04, 2024 | 6:19 PMUpdated Feb 04, 2024 | 6:19 PM
Mahesh Babu: హైదరాబాద్‌ తిరిగి వచ్చిన మహేష్ బాబు

ఈ సంక్రాంతికి రమణ అంటూ వచ్చి.. అభిమానుల్ని అలరించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్- మహేష్ కాంబోలో రూపుదిద్దుతున్న ఈ మూడవ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.  కలెక్షన్ల వర్షం కురిపించింది.  ప్రస్తుతం గుంటూరు కారం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు  మహేష్ బాబు.  అదే క్రమంలో రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.  ఈ మూవీ కోసం ఫిజికల్ ట్రైనర్ దగ్గర ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ చేయించుకునేందుకు విదేశాలకు వెళ్లారు.  జర్మనీలో కొన్ని రోజులు గడిపిన మహేష్ ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో హీరో దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రాజమౌళి సినిమాలో పాత్ర కోసం మహేష్ తన మేకోవర్ పై దృష్టి సారించారు. దీని కోసం జర్మనీలో ప్రత్యేక  ఫిటెనెస్ ట్రైనింగ్ లో పాల్గొన్నారు. అంతే కాకుండా రాజమౌళి సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించే ముందు మిల్కీబాయ్  ఓ రెండు ప్రకటనలు చేయనున్నారని టాక్.  ఎన్నో ఏళ్లుగా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబును చూడాలన్న ఫ్యాన్స్ ఎదురు చూపులకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది.  ఈ టూ మంత్స్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆర్‌ఆర్‌ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా కోసం మహేష్ కూడా ఒకట్రెండు సంవత్సరాలు అంకితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా షూటింగ్, పోస్టు ప్రొడక్షన్, ఇతర వర్క్ అన్న కలుపుకుని ఈ మూవీ విడుదలయ్యే వరకూ ఎంత లేదన్న ఒక మూడు సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. అలాగే  మహేష్ రీసెంట్ గా నటించిన గుంటూరు కారం.. ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 9 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో వీక్షించవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి