iDreamPost
android-app
ios-app

ముఫాసకు డబ్బింగ్ చెప్పడంపై మహేష్ బాబు సూపర్ కామెంట్!

  • Published Aug 21, 2024 | 2:58 PM Updated Updated Aug 21, 2024 | 3:10 PM

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఫాస అనే హాలీవుడ్ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఇస్తున్న సంగతి తెలిసింది. తొలిసారి ఓ హాలీవుడ్ సినిమాకు ఆయన డబ్బింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఫాస పాత్రకు తాను డబ్బింగ్ చెప్పడంపై కామెంట్స్ చేశారు.

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఫాస అనే హాలీవుడ్ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఇస్తున్న సంగతి తెలిసింది. తొలిసారి ఓ హాలీవుడ్ సినిమాకు ఆయన డబ్బింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఫాస పాత్రకు తాను డబ్బింగ్ చెప్పడంపై కామెంట్స్ చేశారు.

  • Published Aug 21, 2024 | 2:58 PMUpdated Aug 21, 2024 | 3:10 PM
ముఫాసకు డబ్బింగ్ చెప్పడంపై మహేష్ బాబు సూపర్ కామెంట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో టాలీవుడ్ ప్రిన్స్ గా, సూపర్ స్టార్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఇప్పటికే అనేక సూపర్ హిట్ సినిమాలతో అలరించిన మహేశ్, త్వరలో దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ రాలేదు. కేవలం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనే విషయం మాత్రమే తెలుసు. వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మహేశ్ బాబు గురించి మరో ఆసక్తికరమై విషయం బయటకు వచ్చింది. ఆయన హాలీవుడ్ లో ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా చాలా పెద్ద హిట్ అయిన యానిమేటెడ్ సిరీస్ లయన్ కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్ నుంచి త్వరలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. ఆ సినిమానే ముఫాస. ఈ హాలీవుడ్ మూవీని భారత్ లో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో స్టార్ సెలబ్రిటీలతో మూవీలోని మెయిన్ లీడ్ రోల్‌కు వాయిస్ ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు వాయిస్ ఓవర్ మహేశ్ బాబు చేత ఇప్పిస్తున్నారు. ముఫాస మూవీలో తండ్రి సింహం అయిన ముఫాస పాత్రకు తెలుగు డబ్బింగ్ మహేష్ బాబు చెప్పనున్నారు.

మహేష్ వాయిస్ ఓవర్‌తో ఉన్న ముఫాస తెలుగు ట్రైలర్‌ను ఆగస్ట్ 26న ఉదయం 11. 07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఆ ట్రైలర్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ఈగర్ గా ఉన్నారు. ఇది ఇలాంటే ఈ హాలీవుడ్ మూవీ ముఫాస పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పడంపై మహేష్ బాబు కీలక విషయాలను ప్రస్తావించారు. మహేష్ బాబు మాట్లాడుతూ..డిస్నీ అందించే ఎంటర్టైన్‌మెంట్, స్టోరీలు చెప్పే విధానం, లెగసీ పాత్రలను అందించే తీరు నన్ను మంత్రముగ్దుడుని చేస్తాయన్నారు. ముఫాస అనేది ఓ  మంచి తండ్రి పాత్రని. అటవీ సామ్రాజ్యంలో తన పిల్లకు మార్గదర్శిగా నిలిచే విధానం తనను ఆకట్టుకుందని మహేశ్ తెలిపాడు. తనకు కూడా తన కుటుంబమే సర్వస్వం అని ఆయన తెలిపారు.

ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికి వస్తే…గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమా తర్వాత మహేశ్ నుంచి వచ్చే కొత్త మూవీ కోసం ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అందులో మహేష్ బాబు ఎలా ఉంటారో అనే క్యూరియాసిటీ రోజు రోజుకీ పెరిగిపోతుంది. మరి.. ఈ విషయాలు తెలియాలంటే.. మేకర్స్ నుంచి అప్ డేట్స్ రావాల్సిందే. మరి.. ముఫాస డబ్బింగ్ ఇవ్వడంపై మహేశ్ బాబు మాట్లాడిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet