మహారాజా మూవీలో విలన్ పాత్రలో నటించిన ఈ నటుడు.. ఒకప్పుడు హీరో అని తెలుసా.?

విజయ్ సేతుపతి రీసెంట్ మూవీ మహారాజా. ఇందులో కూతురుని అమితంగా ప్రేమించే తండ్రిగా నటించాడు విజయ్. ఇక ఇందులో నెగిటివ్ రోల్ పోషించిన ఈ నటుడు గుర్తున్నాడా..? ఒకప్పుడు మంచి హీరో.. కానీ నేడు విలన్ రోల్స్ లో..

విజయ్ సేతుపతి రీసెంట్ మూవీ మహారాజా. ఇందులో కూతురుని అమితంగా ప్రేమించే తండ్రిగా నటించాడు విజయ్. ఇక ఇందులో నెగిటివ్ రోల్ పోషించిన ఈ నటుడు గుర్తున్నాడా..? ఒకప్పుడు మంచి హీరో.. కానీ నేడు విలన్ రోల్స్ లో..

హీరో అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి లేకుంటే స్మార్ట్‌గా కనిపించాలి. కనీసంలో కనీసం హ్యాండ్సమ్ లుక్స్‌లో కనువిందు చేయాలి. కానీ ఇలాంటి బారియర్స్ లేని స్టార్ హీరో అంటే బహుశా విజయ్ సేతుపతికే ఆ క్రెడిట్ దక్కుతుంది. అందుకే ఆయన్ను కోలీవుడ్‌లో వర్సటైల్ యాక్టర్ అంటుంటారు. తాజాగా ఆయన నటించిన చిత్రం మహారాజా. జూన్ 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ సక్సెస్ అందుకుంది. 20 కోట్ల రూపాయల పెట్టి సినిమా తీస్తే.. వంద కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.  దర్శకుడు నిథిలన్ సామినాథన్ అందించిన కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బలం. ఇక ఇందులో విజయ్ సేతుపతి బార్బర్‌గా, ఓ పాపకు ఫాదర్‌గా నటించాడు. ఇటీవల ఓటీటీలో కూడా రిలీజై ట్రెండింగ్‌లో నిలిచిన సంగతి విదితమే. ఇది ఓ రివేంజ్ స్టోరీ మూవీ.

చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల విలన్ గ్యాంగ్.. విజయ్ సేతుపతి ఇంట్లోకి వెళ్లి వస్తువులను ధ్వంసం చేస్తారు. అలాగే కూతురిపై అత్యాచారానికి ఒడిగడతారు గ్యాంగ్‌లోని ఇద్దరు. వారిలో ఒకడు ధన. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్ ఆ మూవీలోనిదే. ఓ సారి కథలోకి వెళితే.. సెల్వం (అనురాగ్ కశ్యప్) అనుకోకుండా పోలీసులకు దొరికిపోతాడు. అతడ్ని పట్టించింది విజయ్ సేతుపతి అనుకుని అతడిపై రివేంజ్ తీర్చుకునే క్రమంలో అతడికి ఇంటికి మరో ఇద్దరితో కలిసి వెళతాడు. అప్పుడు మహారాజా కూతురిపై దాడి చేస్తారు. కానీ ధన అండ్ మరో వ్యక్తి అమ్మాయిపై అత్యాచారం చేశారు. ఈ ధన క్యారెక్టర్లలో నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..? మణికందన్. అతడు గతంలో ఎస్ శంకర్ మూవీలో నటించాడని తెలుసా..? అదే బాయ్స్. బాయ్స్ మూవీలో యాక్సిడెంట్‌లో చనిపోయిన క్యారెక్టర్ చేసింది మణికందనే.

సిద్దార్థ్, జెనీలియా హీరో హీరోయిన్లు శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ మూవీలో కుమార్ పాత్రలో నటించాడు మణికందన్ . కానీ ఈ క్యారెక్టర్ మధ్యలో చనిపోతుంది. ఆ తర్వాత సోలో హీరోగా కూడా పలు చిత్రాలు చేశాడు. కాదల్ ఎఫ్ ఎం, కిచ్చా వయస్సు 16, యుగ వంటి చిత్రాల్లో మెయిన్ రోల్స్ చేశాడు. సమంత, రాహుల్ రవీంద్రన్ యాక్ట్ చేసిన మూవీ మాస్కో కావేరీలో కూడా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. గురుస్వామి, కాదల్ 2014 చిత్రాల్లో నటించాడు. తెన్ మార్క్ పరువకట్రు, సూదు కవ్వం వంటి హిట్ చిత్రాలను చేజార్చుకున్నాడు. ఇవే సినిమాలు చేసి విజయ్ సేతుపతి స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత భగీర మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. మార్క్ ఆంటోనీ తర్వాత మహారాజా చిత్రాల్లో నెగిటివ్ రోల్ లో నటించాడు. కాగా, మణికందన్ కన్నా.. కుమార్ అన్న పేరు చాలా మందికి గుర్తుండిపోతుంది. సెకండ్  ఇన్నింగ్స్ లో మళ్లీ బిజీగా మారిపోవాలని ఆశిద్దాం.

Show comments