iDreamPost
android-app
ios-app

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్ బాబు సినిమా రిపీట్ గా చూశా: విజయ్ సేతుపతి

  • Published Aug 12, 2024 | 12:06 PM Updated Updated Aug 12, 2024 | 12:06 PM

బాధలో ఉన్నప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ఓ సినిమాను రిపీట్ మోడ్ లో చూసేవాడినని చెప్పుకొచ్చాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

బాధలో ఉన్నప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ఓ సినిమాను రిపీట్ మోడ్ లో చూసేవాడినని చెప్పుకొచ్చాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

  • Published Aug 12, 2024 | 12:06 PMUpdated Aug 12, 2024 | 12:06 PM
Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్ బాబు సినిమా రిపీట్ గా చూశా: విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి.. విలక్షణ నటుడికి మారుపేరు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు విలన్ రోల్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అదీకాక స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు సైతం పోషిస్తున్నాడు. ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. విజయ్ సేతుపతి నటించిన సినిమాల్లో ఆయన పాత్రే కనిపిస్తుంది తప్ప.. ఆయన కనిపించరు. అంతలా ఆ పాత్రకు ప్రాణంపోస్తాడు. కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు వెళ్లడించాడు. బాధలో ఉన్నప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ఓ సినిమాను రిపీట్ మోడ్ లో చూసేవాడినని చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

“నేను బాధల్లో ఉండి ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు మహేశ్ బాబు నటించిన ‘అతడు’ మూవీని రిపీట్ మోడ్ లో చూశా. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ ఇప్పటికీ నాకు గుర్తే. ఎమోషన్స్ ను ఈ సినిమాలో త్రివిక్రమ్ అద్భుతంగా చూపించారు. అలాగే మహేశ్-త్రిష కెమిస్ట్రీ సూపర్. బ్రహ్మానందం కామెడీ సీన్స్ అయితే సూపర్. ఇలా సినిమాలో ప్రతీది నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమా చూస్తే రిలాక్స్ ఫీల్ అవుతా. కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మూవీ చూస్తే.. ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది” అంటూ విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ను మహేశ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

When I was in trouble, I watched Mahesh Babu's movie on repeat

కాగా.. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్ లో 2005లో వచ్చిన ‘అతడు’ మూవీ క్లాసిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికీ టీవీల్లో వస్తే.. మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారనడంలో అతిశయోక్తిలేదు. ఇదిలా ఉండగా.. లేటెస్ట్ గా విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. వసూళ్ల పరంగా కూడా అదరగొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘విడుదల పార్ట్ 2’తో పాటుగా మరో తమిళ్ మూవీలో నటిస్తున్నాడు. మరి బాధలో ఉన్నప్పుడు రిపీట్ గా మహేశ్ మూవీ చూస్తాను అన్న విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss