iDreamPost
android-app
ios-app

త్రిష, చిరంజీవిపై మన్సూర్ పరువునష్టం దావా కేసు.. మద్రాసు హైకోర్టు కీలక తీర్పు!

ఇటీవలే త్రిష పై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీస్ సైతం చిరంజీవి, ఖుష్బూ త్రిషకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీని పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది.

ఇటీవలే త్రిష పై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీస్ సైతం చిరంజీవి, ఖుష్బూ త్రిషకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీని పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది.

త్రిష, చిరంజీవిపై మన్సూర్ పరువునష్టం దావా కేసు.. మద్రాసు హైకోర్టు కీలక తీర్పు!

తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్.. కొంతకాలంగా ఈయన పేరు వార్తల్లో మారుమోగుతోంది. గతంలో ఆయన కోలివుడ్ స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో నేను చాలా సినిమాల్లో ఇతర నటిమణులతో రేప్ సీన్స్ చేశాను. అయితే లియో సినిమాలో నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, తనతో బెడ్ రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను. కానీ ఆ సీన్ లేకపోవడంతో బాధేసిందంటూ చిల్లర కామెంట్లు చేశాడు. ఇక అతడి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారి నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో త్రిష మన్సూర్ పై మండిపడింది.

అంతేకాకుండా చిరంజీవి, ఖుష్బూ, చిన్మయి తదితర సెలబ్రిటీలు సైతం మన్సూర్‌ వైఖరిని తప్పుపడుతూ.. త్రిషకు మద్దతుగా నిలిచారు. ఇక ఈ విషయం పై మన్సూర్ త్రిషకు క్షమపణాలు చెప్పడం ఈ వివాదం సద్దుమనగడం అంతా జరిగిపోయింది. కానీ, మన్సూర్ మాత్రం అంతటితో అగాకుండా.. అనవసరంగా నన్ను ఈ వివాదంలోకి లాగారని, తాను అమాయకుడినని.. త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూ పై పరువునష్టం దావా వేశాడు. అయితే దీని పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

Madras high Court

ఇటివలే త్రిష పై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీస్ సైతం చిరంజీవి, ఖుష్బూ త్రిషకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మన్సూర్ త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచి తన వైఖరిని తప్పు పట్టిన చిరంజీవి, ఖుష్బూలపై పరువునష్టం దావా వేశాడు. దీనిపై శుక్రవారం నాడు విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు మన్సూర్ పై మండిపడింది. కేవలం ‘ఒక నటిపై మన్సూర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ మిగతా ముగ్గురు నటులు ఆమెకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. అలాంటి మాటలు మాట్లాడితే ఏ మనిసషైనా అలాగే స్పందిస్తాడు.

ఈ విషయంలో వారికి వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేయడానికి వీల్లేదు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేసినట్లే ఉంది’ అంటూ మన్సూర్‌ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ సతీశ్‌ కుమార్‌ సదరు పిటిషన్‌ను కొట్టివేశాడు. అంతేకాకుండా తమ సమయం వృథా చేసినందుకుగానూ లక్ష రూపాయలు చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెల్లించాలని మన్సూర్‌ను ఆదేశాలను జారి చేసింది. మరి, మన్సూర్ కు కోర్టు ఇచ్చిన తీర్పు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.