iDreamPost
android-app
ios-app

MAD మూవీ సీక్వెల్.. త్వరలో షూటింగ్ ప్రారంభం!

  • Published Jan 17, 2024 | 1:32 PM Updated Updated Jan 17, 2024 | 1:32 PM

MAD 2: ఇటీవల చిన్న సినిమాలు పెద్ద హిట్లు సాధిస్తున్నాయి. అందులో తెలుగు నుంచి వచ్చిన హిట్ మూవీనే మ్యాడ్. ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పువ్వులను పూయించింది. తాజాగా ఆ సినిమా సీక్వెల్ రానుంది.

MAD 2: ఇటీవల చిన్న సినిమాలు పెద్ద హిట్లు సాధిస్తున్నాయి. అందులో తెలుగు నుంచి వచ్చిన హిట్ మూవీనే మ్యాడ్. ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పువ్వులను పూయించింది. తాజాగా ఆ సినిమా సీక్వెల్ రానుంది.

  • Published Jan 17, 2024 | 1:32 PMUpdated Jan 17, 2024 | 1:32 PM
MAD మూవీ సీక్వెల్.. త్వరలో షూటింగ్ ప్రారంభం!

చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద సినిమాలే కాకుండా చిన్ని సినిమాలు కూడా భారీ హిట్ ను సొంతం చేసుకున్న ఘటనలు అనేకం జరిగాయి. చిన్న సినిమాగా వచ్చి.. బాక్సాఫీస్ వద్ద దండయాత్రలు చేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇక అలా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సినిమాలకు సీక్వెల్ తీసేందుకు దర్శకులు సిద్ధమవుతుంటారు. అలాగే ఎన్నో హిట్ సినిమాలకు సీక్వెల్స్ కూడా వచ్చాయి. తాజాగా MAD(మ్యాడ్) మూవీ విషయంలో కూడా అదే జరుగుతుంది. చిన్న సినిమగా వచ్చిన మ్యాడ్ మూవీ థియేటర్లలో సందడి చేసింది. ఆ సినిమాకు ప్రేక్షకులు ఫుల్ మార్కులు ఇచ్చేశారు. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుండని ప్రేక్షకుల అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ సినిమాకు సీక్వెల్  చేయనున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన కామెడీ ఎంట్టైనర్ మూవీ మ్యాడ్. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ , శ్రీగౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉదయన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.  ఈ చిత్రంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాక చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించింది. అలానే ఈ సినిమాతో హీరోగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ బామ్మర్థి, నార్నే నితిన్.. మ్యాడ్ మూవీలో అద్భుతంగా నటించాడు. మిగిలిన వారసులకు భిన్నంగా మాస్ యాక్షన్ మూవీతో కాకుండా యూత్ ఫుల్ కాలేజ్ డ్రామా అయినా మ్యాడ్ మూవీని తన మొదటి సినిమాగా నార్నే నితిన్ ఎంచుకున్నాడు. అక్టోబర్ 6న విడుదలైన ఈ సినిమా..2023లో క్లీన్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

ఈ సినిమాలో ఇంట్రోవర్డ్ అశోక్ గా నార్నే నితిన్, దామోదర్ పాత్రకి సంగీత్ శోభన్ మంచి కామోడీ పండించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో  వచ్చిన ఈ మూవీకి బీమ్స్ సిసిర్లీయో అద్భుతమైన మ్యూజియ్ అందించాడు. సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్ తీసేందుకు దర్శకుడు కల్యాణ్ శంకర్ సిద్దమయ్యారు. MAD-2 పేరుతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మ్యాడ్-2 మూవీని శర్వానంద్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాతో పాటు సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో కల్యాణ్ శంకర్ మరో సినిమా కూడా చేయనున్నారు. మరి.. మ్యాడ్ సీక్వెల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş