iDreamPost
android-app
ios-app

క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫేవరేట్ హీరోయిన్!

  • Published Jul 04, 2024 | 5:55 PM Updated Updated Jul 04, 2024 | 5:55 PM

Ananthika Sanilkumar: టాలీవుడ్ లోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. కొందరు అలా తళుకునమెరిసి కనుమరుగవుతుంటారు. మరికొందరు మాత్రం ఏళ్ల తరబడి ఉంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుతుంటారు. అలాంటి ఓ బ్యూటి స్కూల్ డేస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ananthika Sanilkumar: టాలీవుడ్ లోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. కొందరు అలా తళుకునమెరిసి కనుమరుగవుతుంటారు. మరికొందరు మాత్రం ఏళ్ల తరబడి ఉంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుతుంటారు. అలాంటి ఓ బ్యూటి స్కూల్ డేస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Jul 04, 2024 | 5:55 PMUpdated Jul 04, 2024 | 5:55 PM
క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫేవరేట్ హీరోయిన్!

ప్రస్తుతం సోషల్ మీడియా హవా బాగా నడుస్తోంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిన క్షణాల్లో నెటింట్లో ప్రత్యక్షమవుతుంటాయి. ఇది ఇలాంటి  ఎక్కువ మంది సెలబ్రిటీల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల చైల్ హుడ్ ఫోటోలు , కాలేజీ డేస్ లోని ప్రత్యేకమైన ఫిక్స్ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పై ఫోటోలు క్యూట్ గా కనిపిస్తున్న ఆ అమ్మాయి.. ఇప్పుడు కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ గా ఉంది. మరి.. ఆమె ఎవరో  ఇప్పుడు తెలుసుకుందాం…

టాలీవుడ్ లోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. కొందరు అలా తళుకునమెరిసి కనుమరుగవుతుంటారు. మరికొందరు మాత్రం ఏళ్ల తరబడి ఉంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుతుంటారు. చాలా మంది హీరోయిన్లు ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లిక్ అయి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంటున్నారు. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుని.. అందం, అభినయంతో కుర్రాళ్లకు ఫేవరేట్ హీరోయిన్ గా నిలిచిపోతారు. అలాంటి వారిలో మనం చెప్పుకోబేయే ఈ అమ్మాయి ఒకరు. తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది.

ఇప్పుడిప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ హీరోయిన్ కి  సంబంధించిన స్కూల్ డేస్ ఫిక్ ఒకటి నెట్టింట్లో వైరలవుతుంది. ఒక్క సినిమాతో ఓ రేంజ్ ఫాలోయింగ్ అందుకుంది. ఇక ఇన్ స్టాలో ఈ అమ్మాడి క్రేజ్ చూస్తే పిచ్చికెక్కిపోతుంది. ఇక ఎందుకు సస్పెన్స్ … ఆ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్. 2022లో రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. అయితే ఆ సినిమాతో ఈ బ్యూటీకి అంత గుర్తింపు రాలేదు. ఇటివలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్థి నార్నే నితిన్ నటించిన మ్యాడ్ మూవీతో ఈ అమ్మాడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఈ సినిమాలో అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఈ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఈ సినిమా హిట్ కావడంతో ఈ అమ్మడిక వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రజినీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ మూవీలో కనిపించింది. ప్రస్తుతం డైరెక్టర్ ఫణింద్ర నర్సెట్టి రూపొందిస్తున్న ఎనిమిది వసంతాలు సినిమాలో యాక్ట్ చేస్తుంది. కేరళకు చెందిన అనంతిక సనీల్ కుమార్ 2000లో జన్మించింది. ప్రస్తుతం అనంతికకు ఇన్ స్టాలో 857కే ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ ఉంటారు. మొత్తంగా ప్రస్తుతం అనంతిక స్కూల్ డేస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş