Dharani
గుప్త నిధులు, వాటిని చేజిక్కించుకునేందుకు చేతబడి ఈ రెండింటిని లింక్ చేస్తూ తెరకెక్కిన మా ఊరి పొలిమేర-2 చిత్రం భారీ విజయం సాధించింది. ఇక సినిమాలో కథ అంతా గుడి చుట్టూనే తిరుగుతుంటుంది. మరి ఇంతకు ఈ ఆలయం ఎక్కడుంది.. నిజంగానే దానిలో నిధులున్నాయా అంటే..
గుప్త నిధులు, వాటిని చేజిక్కించుకునేందుకు చేతబడి ఈ రెండింటిని లింక్ చేస్తూ తెరకెక్కిన మా ఊరి పొలిమేర-2 చిత్రం భారీ విజయం సాధించింది. ఇక సినిమాలో కథ అంతా గుడి చుట్టూనే తిరుగుతుంటుంది. మరి ఇంతకు ఈ ఆలయం ఎక్కడుంది.. నిజంగానే దానిలో నిధులున్నాయా అంటే..
Dharani
చిన్న సినిమాగా విడుదలైన ‘మా ఊరి పొలిమేర’ అనూహ్య రీతిలో భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ నేపథ్యంలో మేకర్స్.. ఈ సినిమాకు కొనసాగింపుగా పొలిమేర-2ని తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా కూడా భారీ విజయం సాధించించింది. పార్ట్-1లో మర్డర్ మిస్టరీకి చేతబడి అంశాన్ని జత చేసి.. క్షణ క్షణం సస్పెన్స్‌తో కొనసాగేలా మా ఊరి పొలిమేర-2ని తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. పార్ట్-1లో చూపించిన మిస్టరీని పార్ట్-2 రివీల్ చేశారు.
అంతేకాక పార్ట్-2లో జాస్తిపల్లి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాదమూర్తి గుడికి.. కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి.. లింక్ ఉందని.. అక్కడ నిధులు ఉన్నాయని.. వాటిని సొంతం చేసుకోవడం కోసమే.. కొమిరి క్షుద్రపూజలు చేస్తాడనే అంశంతో ఎంతో ఆసక్తిగా పార్ట్ 2ను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి ఆ గుడి గురించి జనాలు గూగుల్‌లో తెగ సర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ గుడికి సంబంధించి ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఇక ఈ సినిమాలో భాగంగా ఆ గుడి జాస్తిపల్లిలో ఉంది అని చూపించారు. కానీ వాస్తవానికి ఆ ఆలయం.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వద్ద ఉన్న గండికోటలో ఉంది. ఈ గుడి 16వ శతాబ్దం నాటిదని చరిత్రకారులు వెల్లడించారు. ఇక ఆ ఆలయాన్ని మాధవ పెరుమాళ్ గుడి లేదా మాధవరాయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది. రాధేశ్యామ్,సైరా నరసింహారెడ్డి, ఇండియన్-2, మర్యాద రామన్న వంటి చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి
ఆలయంలోని కళ, నిర్మాణ లక్షణాలను విశ్లేషించి చూస్తే దీనిని 16వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో నిర్మించినట్లు తెలుస్తోంది అంటున్నారు పురావస్తు శాఖ నిపుణులు. అంతేకాక ఈ ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావన 16వ శతాబ్దపు శాసనాలలో గుర్తించారు. గండికోటలో విజయనగర కాలం నాటి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాక 16వ శతాబ్దపు శాసనాలను ఈ గుడిలో గుర్తించారు. పాపా తిమ్మరాజు అనే వ్యక్తితో సహా అనేక మంది వ్యక్తులు మాధవరాయ (లార్డ్ కృష్ణుడు) దేవుడికి నమస్కరించి, దేవుడికి మాల (తోమాల) సమర్పించారని శాసనాల్లో పేర్కొన్నారు.
16వ శతాబ్దంలో ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయం.. ఆ తర్వాత మహ్మదీయుల దాడుల్లో పూర్తిగా కూలిపోయి.. శిథిలావస్థకు చేరుకుంది. గుడి పూర్తిగా ధ్వంసం కావడంతో.. ఆలయంలో ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి కడప జిల్లాలోని మైదుకూరుకు తరలించినట్లు ఆధారాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ గుడిలో దేవుడి విగ్రహం లేదు. ఊరికి దూరంగా ఉండటం వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరిగే ఛాన్స్ ఉందని గుడిని లాక్ చేసి ఉంచుతారు. టూరిస్ట్‌లు వెళ్లిన సమయంలో గేట్లు తెరుస్తారు. స్థానికులు చెబుతున్న ప్రకారం ఆ గుడిలో ఎలాంటి నిధులు లేవని.. మహ్మదీయుల దాడుల సమయంలో వాటిని దోచుకున్నారని చెప్పుకొస్తున్నారు. కానీ గుడి గోడలపై చాలా ప్రత్యేకమైన చిహ్నాలు ఉన్నాయి. అవి ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.