Swetha
ఆగస్ట్ 14 కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అటు ఎన్టీఆర్ మొదటి స్ట్రెయిట్ బాలీవుడ్ ఎంట్రీ.. ఇటు లోకేష్ కనగరాజ్ ,రజిని కాంత్ సినిమా. రెండు పోటాపోటీగా ఆయా సినిమాల మీద హైప్ పెంచుతూనే ఉన్నాయి. మొదట వార్ 2 ట్రైలర్ ను బరిలోకి దింపారు. అయితే ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది అనే టాక్ వచ్చింది.
ఆగస్ట్ 14 కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అటు ఎన్టీఆర్ మొదటి స్ట్రెయిట్ బాలీవుడ్ ఎంట్రీ.. ఇటు లోకేష్ కనగరాజ్ ,రజిని కాంత్ సినిమా. రెండు పోటాపోటీగా ఆయా సినిమాల మీద హైప్ పెంచుతూనే ఉన్నాయి. మొదట వార్ 2 ట్రైలర్ ను బరిలోకి దింపారు. అయితే ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది అనే టాక్ వచ్చింది.
Swetha
ఆగస్ట్ 14 కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అటు ఎన్టీఆర్ మొదటి స్ట్రెయిట్ బాలీవుడ్ ఎంట్రీ.. ఇటు లోకేష్ కనగరాజ్ ,రజిని కాంత్ సినిమా. రెండు పోటాపోటీగా ఆయా సినిమాల మీద హైప్ పెంచుతూనే ఉన్నాయి. మొదట వార్ 2 ట్రైలర్ ను బరిలోకి దింపారు. అయితే ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది అనే టాక్ వచ్చింది. దీనితో అప్పటికి రిలీజ్ అయినా కూలీ అప్డేట్స్ తో కూలిదే పై చేయిగా కనిపించింది. కానీ మూడు రోజుల క్రితం కూలీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు తారుమారు అయ్యాయి. ఎందుకంటే కూలీ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఆ రేంజ్ లో లోకేష్ కూలి ట్రైలర్ కట్ అందించలేకపోయాడన్నది సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనం.
దీనితో ఇప్పుడు హైప్ విషయంలో రెండు సమానం అయిపోయాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్ విషయానికొస్తే.. యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కూలీ ముందంజలో ఉంది. కానీ మెల్లగా వార్ 2 కూడా ఊపందుకుంటుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇంకా సినిమా రిలీజ్ కు సరిగ్గా పది రోజుల సమయం ఉంది. ఇక అటు ప్రమోషన్స్ విషయానికొస్తే.. కూలీ అసలు ఎడతెరపి లేకుండా ప్రమోట్ చేస్తూనే ఉంది. కానీ వార్ 2 నుంచి మాత్రం పెద్దగా సౌండ్ వినపడడం లేదు. కూలీలో భారీ తారాగణం ఉన్న కారణంగా దాదాపు అంతా ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ కి అటెండ్ అవుతున్నారు. దీనితో తారక్ ఫ్యాన్స్ అంతా వార్ 2 ప్రమోషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఆగస్ట్ 10 న వార్ 2 ఈవెంట్ జరిగే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. పేరుకు ఇది హిందీ డబ్బింగ్ మూవీ అయినా సరే తెలుగులో స్ట్రెయిట్ మూవీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. అటు కూలి కూడా అసలు తగ్గేదెలా అంటూ.. అన్ని స్టేట్స్ ఆర్టిస్ట్స్ లను సినిమాలో పెట్టుకుని అన్నిటిని లాంగ్వేజ్స్ ను కవర్ చేస్తుంది. ఇప్పుడు రెండు ట్రైలర్స్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు కాబట్టి.. రిలీజ్ కు మరో రెండు మూడు రోజుల ముందు.. ఫ్యాన్స్ కోరుకునే రేంజ్ లో ఫ్రెష్ ట్రైలర్ కట్ ను రిలీజ్ చేస్తే బావుంటుందని కొందరి అభిప్రాయం. దీనితో లెక్కలు కూడా తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదు. ఫ్రెష్ ట్రైలర్స్ రిలీజ్ చేస్తారా లేదా అనేది సందేహమే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.