Swetha
ఊహించని విధంగా కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ ను అందుకుంటూ ఉంటాయి. మొదట్లో టాక్ అంతంత మాత్రంగా వచ్చినా ఆ తర్వాత మెల్లగా ఊపందుకుంటూ ఉంటుంది. ఇక ఆ సినిమా సత్తా ఏంటో చూపిస్తూ ఉంటుంది. మహా అయితే ఆ హడావిడి ఓ వారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మహావతార్ నరసింహ సినిమా రిలీజ్ అయ్యి పది రోజులు అయినా ఇంకా సినిమాకు బజ్ తగ్గలేదు..
ఊహించని విధంగా కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ ను అందుకుంటూ ఉంటాయి. మొదట్లో టాక్ అంతంత మాత్రంగా వచ్చినా ఆ తర్వాత మెల్లగా ఊపందుకుంటూ ఉంటుంది. ఇక ఆ సినిమా సత్తా ఏంటో చూపిస్తూ ఉంటుంది. మహా అయితే ఆ హడావిడి ఓ వారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మహావతార్ నరసింహ సినిమా రిలీజ్ అయ్యి పది రోజులు అయినా ఇంకా సినిమాకు బజ్ తగ్గలేదు..
Swetha
ఊహించని విధంగా కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ ను అందుకుంటూ ఉంటాయి. మొదట్లో టాక్ అంతంత మాత్రంగా వచ్చినా ఆ తర్వాత మెల్లగా ఊపందుకుంటూ ఉంటుంది. ఇక ఆ సినిమా సత్తా ఏంటో చూపిస్తూ ఉంటుంది. మహా అయితే ఆ హడావిడి ఓ వారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మహావతార్ నరసింహ సినిమా రిలీజ్ అయ్యి పది రోజులు అయినా ఇంకా సినిమాకు బజ్ తగ్గలేదు.. సరికదా రోజు రోజుకి పెరుగుతూ పోతుంది . హరి హర వీరమల్లు సినిమాలు పోటీగా.. ఒక రోజు ఆలస్యంగా ఈ సినిమా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా అనౌన్సుమెంట్స్ తప్ప ప్రమోషన్స్ పెద్దగా జరగలేదు.
కానీ ప్రమోషన్స్ లేకపోయినా సరే.. మాత్ టాక్ తో ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించొచ్చుని ఈ సినిమా ప్రూవ్ చేసింది. బుక్ మై షో లో ప్రతి గంటకు.. సుమారు 11 వేల టికెట్స్ కు పైగా అమ్ముడుపోతున్నట్టు సమాచారం. ఈ రేంజ్ లో టికెట్స్ సోల్డ్ చేసిన ఘనత ఈ సినిమాకు మాత్రమే దక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 70 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ ఊపు ఇలానే కొనసాగితే ఇంకో వారం రోజుల్లో మూవీ వంద కోట్ల మైలు రాయిని దాటడం ఖాయం
సో ఇప్పట్లో ఈ సినిమా శాంతించేలా లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆగష్టు 14 కూలి, వార్ 2 సినిమాలు వచ్చేంత వరకు ఈ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగొచ్చు. నిజానికి హోంబలే వారు కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ ను ఊహించి ఉండరు. బయ్యర్లు , డిస్ట్రిబ్యూటర్లు అంతా లాభాలు చూస్తున్నారు. ఒక యానిమేషన్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ప్రేక్షకుడికి ఒక సినిమా నచ్చాలి అంటే ఆ సినిమాలో స్టార్లు లేకపోయినా.. కంటెంట్ బలంగా ఉంటే చాలని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇక ముందు ముందు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.