Swetha
విజయ్ దేవరకొండ కింగ్డమ్ ను కొండంత ఆశలతో రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ యాక్టింగ్ , మేకింగ్ ఇలా అంతా బాగానే ఉంది. కానీ ఎక్కడో ఎందుకో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు టికెట్ వర్త్ మూవీ అనే ఫీలింగ్ కలిగించలేకపోయింది. పైగా పార్ట్ 2 అనౌన్సుమెంట్ కొసమెరుపు.
విజయ్ దేవరకొండ కింగ్డమ్ ను కొండంత ఆశలతో రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ యాక్టింగ్ , మేకింగ్ ఇలా అంతా బాగానే ఉంది. కానీ ఎక్కడో ఎందుకో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు టికెట్ వర్త్ మూవీ అనే ఫీలింగ్ కలిగించలేకపోయింది. పైగా పార్ట్ 2 అనౌన్సుమెంట్ కొసమెరుపు.
Swetha
విజయ్ దేవరకొండ కింగ్డమ్ ను కొండంత ఆశలతో రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ యాక్టింగ్ , మేకింగ్ ఇలా అంతా బాగానే ఉంది. కానీ ఎక్కడో ఎందుకో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు టికెట్ వర్త్ మూవీ అనే ఫీలింగ్ కలిగించలేకపోయింది. పైగా పార్ట్ 2 అనౌన్సుమెంట్ కొసమెరుపు. మొదటి వీకెండ్ వరకు కనీసం పరవాలేదు అనిపించుకున్న సినిమా వర్కింగ్ డే లో పూర్తిగా నీరుకారిపోయినట్టు అయిపోయింది. కోటి రూపాయల షేర్ కూడా దాటలేదని టాక్.
సరే వర్కింగ్ డేస్ పక్కన పెట్టేసి రెండో వీకెండ్ కోసం ఎదురుచూసి.. అక్కడ ఈ లాస్ రికవర్ చేయొచ్చు అనుకుంటే పొరపాటే. ఇది జరిగే పనిలా అసలు కనిపించడం లేదు. అసలైతే ఆగస్ట్ 14 కూలి , వార్ 2 వచ్చేవరకు కింగ్డమ్ కు ఓపెన్ గ్రౌండ్ దక్కిన మాట వాస్తవమే. ఒకవేళ టాక్ బాగా ఉంటె ఈ వీకెండ్ కాకపోతే మరో వీకెండ్ అనిపించుకునేదేమో. కానీ ఇప్పుడు మధ్యలో మహేష్ పుట్టినరోజు సందర్బంగా అతడు రీరిలీజ్ ఒకటి ఉంది.
ఆగష్టు 9 న అతడు సినిమాను 4 కె వెర్షన్ ప్రింట్ తో రీరిలీజ్ చేయనున్నారు. ఈ మధ్య రీరిలీజ్ లకు ఎలాంటి స్పందన వస్తుందో తెలియనిది కాదు. పైగా ఈ రీరిలీజ్ కు మహేష్ ఫ్యాన్స్ తో పాటు అటు నిర్మాతలు కూడా చాలా పర్సనల్ గా తీసుకున్నారు. ఒక స్ట్రైట్ సినిమాకు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో అతడు మూవీ రిలీజ్ అవుతుంది. హైదరాబాద్ లో మెయిన్ థియేటర్ గా సంధ్య ను పిక్ చేసుకున్నారు. పీవీఆర్ తో ఒప్పందం, సగానికి పైగా సింగల్ స్క్రీన్స్ ను దక్కించుకున్నారు.
సో పక్కా ప్లానింగ్ తో అతడు రీరిలీజ్ బరిలోకి దిగుతుంది. ఇది ప్రచారం మాత్రమే కాదు అటు బుక్ మై షో లో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో సత్తా చూపిస్తూనే ఉంది. సో ఈ వీకెండ్ కింగ్డమ్ ను అతడు దెబ్బకొట్టేలానే ఉన్నాడు. ఒక స్ట్రైట్ సినిమాపై ఒక రీరిలీజ్ సినిమా దెబ్బపడడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో చాలా సినిమాల విషయంలో ఇది జరిగింది. రెండు నెలల క్రితం భైరవం సినిమా విషయంలో కూడా జరిగింది ఇదే. అయితే అప్పుడు ఖలేజా ఇప్పుడు అతడు అంతే తేడా. ఇప్పుడు కింగ్డమ్ విషయంలో ఏమి జరుగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.