iDreamPost
android-app
ios-app

రిషబ్ ప్లాన్ ఏంటి.. కాంతారలో తారక్ ?

  • Published Aug 04, 2025 | 3:54 PM Updated Updated Aug 04, 2025 | 3:54 PM

ఒక హీరో కెరీర్ మలుపు తిరగడానికి ఒక్కోసారి ఒక్క సినిమా చాలనిపిస్తుంది. అలా రిషబ్ శెట్టికి కాంతారా సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. రిషబ్ శెట్టి అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది కాంతారా సినిమానే. ఈ సినిమాతో ఒక్క రాత్రిలో స్టార్ నటుడుగా మారిపోయాడు రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.

ఒక హీరో కెరీర్ మలుపు తిరగడానికి ఒక్కోసారి ఒక్క సినిమా చాలనిపిస్తుంది. అలా రిషబ్ శెట్టికి కాంతారా సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. రిషబ్ శెట్టి అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది కాంతారా సినిమానే. ఈ సినిమాతో ఒక్క రాత్రిలో స్టార్ నటుడుగా మారిపోయాడు రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.

  • Published Aug 04, 2025 | 3:54 PMUpdated Aug 04, 2025 | 3:54 PM
రిషబ్ ప్లాన్ ఏంటి.. కాంతారలో తారక్ ?

ఒక హీరో కెరీర్ మలుపు తిరగడానికి ఒక్కోసారి ఒక్క సినిమా చాలనిపిస్తుంది. అలా రిషబ్ శెట్టికి కాంతారా సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. రిషబ్ శెట్టి అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది కాంతారా సినిమానే. ఈ సినిమాతో ఒక్క రాత్రిలో స్టార్ నటుడుగా మారిపోయాడు రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం కాంతారాకు ప్రిక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టే.. ఈ అక్టోబర్ 2 కు సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన విషయాల్లో ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది.

ఈ కాంతారా ప్రిక్వెల్ తర్వాత.. కాంతారా 3 ని కూడా తీయబోతున్నట్లు.. అందులో ఎన్టీఆర్ మెయిన్ లీడ్ గా నటించబోతున్నట్లు.. దానికోసం తారక్ తో చర్చలు కూడా జరిపినట్లు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ ఫ్రాంచైజ్ రేంజ్ ఏ మారిపోవడం ఖాయం. పైగా తారక్ కన్నడ భాష చాలా అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటాడు. ఇక గతంలో ఓసారి తారక్ తన కుటుంబ సభ్యులతో సహా రిషబ్ ని కలిసిన సంగతి కూడా తెలిసిందే . ఇలా ఏ రకంగా చూసిన కాంతారా 3 లో తారక్ పెర్ఫెక్ట్ గా ఇమిడిపోతాడు. అయితే దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. రిషబ్ ఏమి ప్లాన్ చేస్తున్నాడో కూడా తెలీదు.

ఎందుకంటే ఇప్పటికే రిషబ్ చేతిలో ఓ మూడు నాలుగు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఛత్రపతి శివాజీ బయోపిక్, ‘జై హనుమాన్’ చిత్రాలతో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లో రీసెంట్ గా ఓ సినిమాను అనౌన్స్ చేసాడు. అటు తారక్ కూడా బిజీ బిజీగానే ఉన్నాడు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆ తర్వాత దేవర 2 ఉండనే ఉంది. ఇలా ఏ విధంగా చూసిన కాంతారా 3 ఛాయలు ఇప్పట్లో ఎక్కడ కనిపించడం లేదు. కానీ ఎన్టీఆర్ నటించనున్నాడు అనే టాక్ మాత్రం బయట చెక్కర్లు కొడుతోంది. ఇక రిషబ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.