iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ స్ట్రైక్..సెట్స్ పై ఉన్న సినిమాల పరిస్థితి ?

  • Published Aug 04, 2025 | 12:49 PM Updated Updated Aug 04, 2025 | 12:49 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో సమ్మె సైరన్ మోగింది. తమకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ.. అందుకు అంగీకరించే నిర్మాతల సినిమాలకు మాత్రమే తాము పని చేయాలనీ ఫిలిం ఫెడరేషన్ డిసైడ్ చేసింది. అలాగే పెంచిన వేతనాలు కూడా ఏ రోజువి ఆరోజే ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీనితో ఈ రోజు ఉదయం నుంచి చాలా మంది కార్మికులు షూటింగ్స్ వెళ్లడం ఆపేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సమ్మె సైరన్ మోగింది. తమకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ.. అందుకు అంగీకరించే నిర్మాతల సినిమాలకు మాత్రమే తాము పని చేయాలనీ ఫిలిం ఫెడరేషన్ డిసైడ్ చేసింది. అలాగే పెంచిన వేతనాలు కూడా ఏ రోజువి ఆరోజే ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీనితో ఈ రోజు ఉదయం నుంచి చాలా మంది కార్మికులు షూటింగ్స్ వెళ్లడం ఆపేశారు.

  • Published Aug 04, 2025 | 12:49 PMUpdated Aug 04, 2025 | 12:49 PM
టాలీవుడ్ స్ట్రైక్..సెట్స్ పై ఉన్న సినిమాల పరిస్థితి ?

తెలుగు చిత్ర పరిశ్రమలో సమ్మె సైరన్ మోగింది. తమకు 30 శాతం వేతనాలు పెంచాలంటూ.. అందుకు అంగీకరించే నిర్మాతల సినిమాలకు మాత్రమే తాము పని చేయాలనీ ఫిలిం ఫెడరేషన్ డిసైడ్ చేసింది. అలాగే పెంచిన వేతనాలు కూడా ఏ రోజువి ఆరోజే ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీనితో ఈ రోజు ఉదయం నుంచి చాలా మంది కార్మికులు షూటింగ్స్ వెళ్లడం ఆపేశారు. ఈ మధ్య ఫిల్మ్ ఛాంబర్‌కు, ఫిల్మ్ ఫెడరేషన్‌కు మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో.. సోమవారం నుంచి బంద్ కు పిలుపునిచ్చారు. దీనితో చాలా వరకు షూటింగ్స్ ఆగిపోయినట్లు సమాచారం. ఇది ఇలానే కొనసాగితే ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న భారీ బడ్జెట్ సినిమాల మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

ఈరోజు అల్లరినరేష్ కొత్త సినిమా పూజ కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇప్పుడు బంద్ కారణంగా ఆ కార్యక్రమం వాయిదా వేసుకున్నారు. అటు అనిల్ రావిపూడి , చిరంజీవి మూవీ కీలక దశలో ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే నటీనటుల కాల్షీట్లు వృధా అవ్వడంతో పాటు.. భారీ సెట్స్ వాటి రెంట్స్ కూడా అదనపు ఖర్చుగా మారుతుంది. అలాగే అటు బాలకృష్ణ అఖండ 2 , రాజాసాబ్ , మరో వైపు రామ్ సినిమా నైట్ , డెకాయిట్ , మిరాయ్ లాంటి ఎన్నో సినిమాలు సెట్స్ షూటింగ్ దశలోనే ఉన్నాయి. వాటికోసం వందలాది మంది సిబ్బంది అవసరం అవుతారు. సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే కనుక.. మూవీ బడ్జెట్స్ పెరిగిపోవడం , సినిమా రిలీజ్ డేట్స్ లు మారిపోవడం ఇలా చాలానే కొత్త ఇబ్బందులు చుట్టుముట్టే అవకాశం ఉంది.

ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్.. నిర్మాతలు ఎవరు టెన్షన్ పడి వర్కర్స్ ఫెడరేషన్‌తో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోవద్దని.. ఫిల్మ్ ఛాంబర్‌ సంబంధిత అధికారులతో వారు చర్చలు జరుపుతున్నామని.. ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. ఈరోజు సాయంత్రానికి ఈ వివాదాలు ఓ సర్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి.